Home / Entertainment / జనవరి 10న ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ పాటలు.

జనవరి 10న ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ పాటలు.

Author:

Seethamma Anadalu Ramayya Sitralu

‘ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ’‘కుమారి 21 ఎఫ్’ చిత్రలతో హ్యాట్రిక్ ను సాధించి క్రేజీస్టార్ గా మారాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ చిత్రంపై వుంది. ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ను పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ”ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. పతాక సన్నివేశాలను భారీఖర్చుతో చిత్రీకరించాం. జనవరి 10న ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేసి, జనవరి మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు

(Visited 133 times, 1 visits today)