Home / Entertainment / సెల్ఫీ రాజా సినిమా రివ్యూ & రేటింగ్.

సెల్ఫీ రాజా సినిమా రివ్యూ & రేటింగ్.

Selfie-Raja-Movie-Review-And-Rating-Story-Talk-Collections

Alajadi Rating

1.75/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: అల్లరి నరేష్ , కామ్న,సాక్షి చౌదరి, సప్తగిరి,పృథ్వీ ,రవిబాబు తదితరులు.

Directed by: ఈశ్వర్ రెడ్డి

Produced by: రామబ్రహ్మం చౌదరి

Banner: గోపి ఆర్ట్స్

Music Composed by: సాయికార్తీక్

Selfie-Raja-Movie-Review-And-Rating-Story-Talk-Collections

‘సుడిగాడు’ సినిమా హిట్ అయిన తరువాత ఇప్పటి వరకు అల్లరి నరేష్ పది సినిమాలు చేశాడు కానీ దాంట్లో ఒక్క సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు, వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లరి నరేష్ ఈసారి కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుని ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ ఫేమ్ ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘ సెల్ఫీ రాజా ’ సినిమా చేశాడు, ఇప్పటి సెల్ఫీల ట్రెండ్ నడుస్తుండటంతో జనాలకి కూడా ‘ సెల్ఫీ రాజా ‘ టైటిల్ బాగానే ఎక్కింది, ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అయినా అల్లరోడి రాతను మార్చేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న కుర్రాడు రాజా( అల్లరి నరేష్). పెద్దయ్యాక సెల్ఫీ పిచ్చితో పాటు నోటి దూల కూడా చూపిస్తుంటాడు. కనిపించిన ప్రతి దాంతోనూ సెల్ఫీ దిగుతూ ఉన్న అతను తొలి చూపులోనే శ్వేత(కామ్న రనావత్)తో ప్రేమలో పడిపోతాడు. ఇతని మంచితనం చూసి శ్వేత కూడా తొందర్లోనే అతని ప్రేమను ఒప్పుకుంటుంది.కానీ రాజాకు వేరే అమ్మాయిలతో సంబంధాలున్నాయని అపార్థం చేసుకుని ఆమె అతడికి దూరమవుతుంది. ఆ సమయంలో రాజాకు జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకుంటాడు. తనను చంపమని ఓ రౌడీకి కాంట్రాక్టు ఇస్తాడు. అయితే ఆశ్చర్యంగా అతన్ని చంపేందుకు అచ్చం అతనిలానే ఉండే మరో వ్యక్తి వస్తాడు. మరి ఇంత కన్ఫ్యూజన్ లో సెల్ఫీ రాజా కాపురం నిలబడిందా..? అతన్ని చంపాలని వాళ్లంతా ప్రయత్నిస్తున్నారు.. రాజాలాగే ఉండే మరో వ్యక్తి ఎవరు అనేది మిగతా కథ.. ?

అలజడి విశ్లేషణ:

వరుస ఫ్లాపుల దెబ్బకు తనలో చాలా మార్పు వచ్చేసిందని.. తన తప్పులేంటో తాను తెలుసుకున్నానని.. ‘సెల్ఫీ రాజా’ చూస్తే ఆ సంగతి అర్థమవుతుందని చెప్పాడు అల్లరి నరేష్. కానీ ఈ సినిమా చూస్తుంటే నరేష్ ఇంతగా మారిపోయాడేంటి అనిపిస్తుంది. ఇంతకుముందు అతడి సినిమాల్లో అంతో ఇంతో కథుండేది. కాస్తో కూస్తో కొత్తదనం కోసమైనా ప్రయత్నించేవాడు. కానీ ‘ సెల్ఫీరాజా ’లో ఆ మాత్రం లేకకపోయింది. అర్థం లేని కథ.. తలా తోకా లేకుండా సాగిపోయే కథనం.. జబర్దస్త్ లాంటి కామెడీ షోల స్ఫూర్తితో అల్లుకున్న చీప్ కామెడీ సీన్స్.. అల్లరి నరేష్ సినిమాల్లో ఎప్పుడూ కనిపించే పేరడీలు.. స్పూఫులు.. వీటన్నింటి మిశ్రమమే ‘ సెల్ఫీరాజా ’.

నటన పరంగా చూస్తే రెండు పాత్రల్లో అల్లరి నరేష్ కొన్నిసార్లు ఎనర్జిటిక్ గా మరికొన్ని సార్లు నీరసంగా కనిపిస్తాడు. ఇంకొన్ని సార్లు సినిమా రిజల్ట్ అతనికి ముందే తెలిసిపోయిన ఎక్స్ ప్రెషన్ కనిపిస్తుంది. హీరోయిన్లుగా చేసిన ఇద్దరికీ నటన రాదని ఫస్ట్ సీన్స్ లోనే తెలిసిపోతే.. గ్లామర్ కూడా పెద్దగా లేదని పాటల్లో తేలిపోతుంది. పృథ్విరాజ్ పాత్ర కూడా అతనికీ కొత్త కాదు.. మనకి అసలే కాదు.. డబ్బులేని డాన్ గా రవిబాబు ఎప్పట్లాగే పాత్ర పరిధిమేరకు వెళ్లిపోయాడు. చెవిటిదంపతులు గా కృష్ణ భగవాన్, రజిత మరీ విసిగించేశారు. ఇక మిగతా పాత్రల్లో చాలా వరకూ ఇలా సన్నివేశాల పరంగా వెళుతూ వస్తూ ఉండేవే.

సినిమాలో లెక్కపెట్టలేనంతమంది ఆర్టిస్టులున్నారు. నిజానికి వాళ్లంతా ఎంత వరకూ అవసరం అనేది దర్శకుడికే తెలియాలి. పోనీ వాళ్లను కథా పరంగా వాడుకున్నాడా అంటే ముందసలు కథంటూ ఉంటే కదా అనే డౌటూ వస్తుంది. చాలా సన్నివేశాలు ఎందుకు వస్తున్నాయో పోతున్నాయో అర్థం కాదు. ఇంకొన్ని సీన్స్.. కథాగమనానికి అడ్డుపడ్డాయో కానీ.. అలరించలేకపోయాయి. భర్తను కోల్పోయిన భార్యలు లేడీ విలన్స్ పగ తీర్చుకోవాలని వచ్చి.. క్లైమాక్స్ లో సిఐతో సెటప్ అవడం.. లాంటి సీన్స్ తెలుగు సినిమా దిగజారుడుతనానికి నిదర్శనం. మొత్తంగా కేవలం రెండు గంటల ఆరు నిమిషాల నిడివి మాత్రమే ఉన్న సెల్ఫీరాజా చూస్తున్నంతసేపూ ఏదో మన లైఫ్ సగభాగం ఇక్కడే గడిపేశామా అన్న ఫీలింగ్ వచ్చేస్తే తప్పు సినిమా తీసినవారిదే కానీ.. చూసే వారిది కాదు.

సాంకేతిక వర్గం పనితీరు:

కథాకథనాల్ని బట్టే టెక్నీషియన్స్ పని తీరు కూడా ఉంటుంది. ఇన్ స్పైర్ చేసే అంశాలేమీ లేనపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు..? ఏదో మొక్కుబడిగా పని కానిచ్చేయడం తప్ప. సాయికార్తీక్ సంగీతం.. లోక్ నాథ్ ఛాయాగ్రహణం కూడా అలాగే ఉన్నాయి. ఒకట్రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. మాటలన్నీ కూడా చాలా వరకు అనుకరణ లాగా అనిపిస్తాయి. కథ గురించి కానీ.. కథనం గురించి కానీ చెప్పడానికేమీ లేదు. ఇక ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో పర్వాలేదనిపించిన దర్శకుడు ఈశ్వర్ రెడ్డి.. ఇంత వేగంగా ఈ స్థాయికి పడిపోయాడేంటి అనిపించాడు ‘సెల్ఫీ రాజా’తో. కొన్ని సన్నివేశాల్లో అతడి సెన్సాఫ్ హ్యూమర్ కనిపిస్తుంది కానీ.. లాజిక్ అంటూ లేకుండా సాగిపోయే కథాకథనాల మధ్య అవేమీ ఎలివేట్ కాలేదు. దర్శకుడిగా ఈశ్వర్ పూర్తిగా నిరాశ పరిచాడు.

ప్లస్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్ కామెడీ
  • అక్కడక్కడా అల్లరి నరేష్ టైమింగ్

మైనస్ పాయింట్స్:

  • స్టోరీ
  • డైరెక్షన్
  • ఎడిటింగ్
  • మ్యూజిక్

అలజడి రేటింగ్: 1.75/5

పంచ్ లైన్: ‘ సెల్ఫీ రాజా ‘ లాంటి సినిమాలు వద్దు రాజా..! 

(Visited 3,610 times, 1 visits today)