Home / Political / వ్యాపారులు MRP రేటు కంటే ఎక్కువ రేటుకు వస్తువులను విక్రయిస్తే ఇక జైలుకే!

వ్యాపారులు MRP రేటు కంటే ఎక్కువ రేటుకు వస్తువులను విక్రయిస్తే ఇక జైలుకే!

Author:

మనం ప్రయాణం ఎప్పుడు చేసిన ఎంతో కొంత హడావిడి ఉంటుంది. టైంకు బస్సు (లేదా) ట్రైన్ దొరుకుందో లేదో అని. ఆ సమయంలో ఇంట్లో నుండి కనీసం వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవడం మర్చిపోతాం. ప్రయాణం చేసే సమయంలో కచ్చితంగా మనకు వాటర్ అవసరం, ఇక తప్పదు అన్నట్టు వాటర్ బాటిల్ కోసం వెళితే అక్కడ 20 రూపాయలు ఉన్న వాటరు బాటిల్ ఒక్కసారిగా 30 రూపాయలు అంటాడు. అదేంటి అని అడిగితె అవసరం ఉంటే కొనుక్కో లేదంటే ఇక్కడి నుండి వెళ్ళు అంటారు. అలాగే సినిమాకి వెళ్లిన అక్కడ 15 రూపాలు ఉన్న కూల్ డ్రింక్స్ 25-30 అంటారు. ఇదేంటి తెలిసిన విషయాన్నే మళ్ళీ చెబుతున్నారు అనుకుంటాన్నారా! మీ కోసమే ఇదంతా! ఎందుకంటే ఇక పై MRP రేటు కంటే ఎక్కువకు అమ్మితే ఇక పై చెల్లదు అంటుంది కేంద్రప్రభుత్వం. ఇక నుండి కేంద్ర ప్రభత్వం వినియోగదారుల చట్టం నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తాం అంటుంది.

mrp

ఈ విషయంపై కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఇటీవల ఢిల్లీలో జరిగిన 47 వ ప్రపంచ ప్రమాణాల దినోత్సవంలో మాట్లాడుతూ …..
మార్కెట్ లో ఉన్న ఏ వస్తువైనా MRP రేటుకు మించి అమ్మకూడదని, ఒక వేళ అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని, మొదటి సారి అలా చేస్తే 25 వేల నుండి 1 లక్ష వరకు జరిమానా విధిస్తాం. అలాగే రెండవ సారి కూడా అలానే అమ్మితే ఏకంగా జైలుకే పంపిస్తాం, ఇలాంటి నియమాలు త్వరలోనే అమలు చేస్తామని ఆయన తెలిపారు.

గతంలో ఒక వినియోగదారుడు ఒక మ‌ల్టీప్లెక్స్ లో వాటర్ బాటిల్ కొనడానికి వెళ్ళాడు దానితో మ‌ల్టీప్లెక్స్ యాజమాన్యం అతనికి వాటర్ బాటిల్ MRP రేటు కంటే ఎక్కువకి అమ్మింది దానితో వినియోగదారుడు ఈ విషయాన్ని జిల్లా వినియోగదారుల ఫోరానికి తెలియజేసాడు. దానితో అసలు ధర కన్నా ఎక్కువ రేటుకు అమ్మినందుకు సదరు యాజమాన్యం వినియోగదారునికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ కోర్టు తీర్పు ఇచ్చింది. దానితో చేసేది ఏమిలేక మ‌ల్టీప్లెక్స్ యాజమాన్యం 25 లక్షలు వినియోగదారునికి ఇచ్చింది. ఇక నుండైనా ఇలాంటి విషయాలు మీకు జరిగితే వెంటనే మీ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించి మీకు తగిన న్యాయం చేకూర్చుకొండి.

(Visited 3,153 times, 1 visits today)