Home / Inspiring Stories / సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఆన్ లైన్ లో ఆవు పిడకల అమ్మకం.

సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఆన్ లైన్ లో ఆవు పిడకల అమ్మకం.

Author:

Cow Dung 1

ఆన్ లైన్ మార్కెట్ శ‌ర‌వేగంతో విస్త‌రిస్తున్న‌ది.. అమ్మ‌కానికి కాదేది అన‌ర్హం అంటున్నారు ఆన్ లైన్ వ్యాపారులు.ఆన్ లైన్‌లో ఎలక్ట్రానిక్, గార్మెంట్స్, ఫుట్‌వేర్ ఐటమ్‌లే కావు ఇప్పుడు అమెజాన్‌లో ఆవుపేడ కూడా లభ్యమవుతున్నది. ఆవుపేడతో పాటు పేడతో చేసిన పిడకలు. గోమూత్రం కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. వాటిలో ఆఫర్స్ కూడా ఉన్నాయి. నాలుగు పిడకలు రూ.249 కాగా, ఎనిమిది పిడకలు రూ.319. ఆవుపేడను, గోమూత్రాన్ని పవిత్రంగా పూజించే మనదేశంలో ఈ పిడకలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ అమ్ముడవుతున్నాయట. గోమూత్రాన్ని ఒక బాటిల్ ధర రూ.80గా ధర నిర్ణయించారు. ఆన్ లైన్ లో ఆవు పేడ‌కు, పిడ‌క‌ల‌కు డిమాండ్ బాగానే ఉంద‌ట‌.

బుక్ చేస్తే చాలు. ఇకపై పిడకలు కూడా అడ్రస్ వెతుక్కుంటూ ఇంటికొస్తయ్. నాలుగు పిడకలు ఇంత.. పది పిడకలు ఇంత అంటూ రేట్లు పెట్టి అమ్ముతున్నారు వ్యాపారులు. వాటిపై డిస్కౌంట్లు కూడా పెట్టేసి అమ్మేస్తున్నారు. సేల్స్ కూడా ఫుల్ గా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. పిడకలు ఇకపై ఆన్ లైన్ లో కూడా దొరుకుతయ్. పండగ సీజన్ పిడకలని కూడా ఆన్ లైన్ లోకి తెచ్చింది. ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్న వాటిల్లో పిడకలు కూడా అంటున్నాయి కొన్ని కంపెనీలు. డిమాండ్ ఉండబట్టే. ఆన్ లైన్ లోకి తీసుకొచ్చామంటున్నారు ఈకామర్స్ వ్యాపారులు.

Cow Dung Cakes Online

ఈ కామర్స్ వెబ్ సైట్లలో పేడ కూడా దొరుకుతోంది. అమెజాన్, బిగ్ బాస్కెట్, షాప్ క్లూస్, హోమ్ షాప్18 లాంటి పెద్ద వెబ్ సైట్లు కూడా రకరకాల పూజా వస్తువులు, సామాగ్రితోపాటు ఆవుపేడ అమ్మకాలు చేస్తున్నాయి. పండగల వేళ ఆవు పేడ అమ్మకాలు రెట్టింపు అవుతున్నాయంట. ఆవు పేడ పిడకలున్న ఒక్కో ప్యాకెట్ (నాలుగు పిడకలు) ధర రూ. 40 నిర్ణయించారు. అలాగే 24 పిడకలున్న ప్యాకెట్ రూ. 150 వరకు ఉంటుంది. అన్నట్లు వీటిపై డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయండోయ్. పట్టణ ప్రాంతాల్లో ఆవు పేడ దొరకడం కనాకష్టంగా మారిపోయిందని గమనించిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇలా పిడకల వ్యాపారం మొదలు పెట్టాడు. అయితే ఆ..! పీడకలమ్మటమా..? అని తేలిగ్గా పెదవి విరిచేయకండీ… వినోద్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా సంపాదించిన దాని కంటే ఎక్కువే ఈ పిడకల వ్యాపారంలో సంపాదిస్తున్నాడు.

Cow Dung 2

చిత్తూరు జిల్లా ఎగువ తవణంపల్లె గ్రామానికి చెందిన వినోద్‌రెడ్డి నిజానికి బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థి ఏదొ ఒక పని చేయాలి కాబట్టి ఒక టెక్ సపోర్ట్ కంపెనీలో చేరాడు పేరుకే సాఫ్ట్ వేర్ సంపాదన మాత్రం అంతంతే, దానికి తోడు ఉన్న ఊరును, కన్న వాళ్లను విడిచి అక్కడెక్కడో పగటికి రాత్రికి తేడా లేకుండా కష్టపడాలి… దీని మీద బోర్ కొట్టిన ఈ టెక్కీ గాయ్….తన బుర్రకు పదును పెట్టాడు. కమ్ బ్యాక్ చిత్తూర్ అని జాబ్ కు రిజైన్ చేసి సొంతూరికి వచ్చాడు. స్వగ్రామానికి చేరుకున్న వినోద్‌రెడ్డి 2 నాటు ఆవులు, 4 పుంగనూరు జాతి అవులను కొన్నాడు. వాటి నుంచి వచ్చే పేడతో పిడకలను తయారు చేయించడం స్టార్ట్ చేశాడు. అయితే మొదట్లో యఙ్ఞాలు జరిగే గుళ్ళను కన్సల్ట్ చేసాడట కానీ ప్రతీ పెద్దగుడికి ఒక సొంత గోశాల ఉండటంతో పెద్దగా ఆర్డర్లు రాలేదు. దాంతో సంగతి ఇలా కాదనుకొని ఒక సారి ఆన్లైన్ లో అమ్మటం మొదలు పెట్టాడు అంతే ఆర్డర్ల మీద ఆర్డర్లు ఈ “ఆవు పిడకల కోసం వచ్చాయట” ఇకనేం పిడకల తయారీ సప్లై ఊపందుకుంది… శుభకార్యాలు, పండుగలు, హోమాలు, యజ్ఞాలు, దహన సంస్కారాలలో కూడా ఆవు పేడతో చేసిన పిడకల అవసరం ఉండటం తో వ్యాపారం మూడు పిడకలూ ఆరు గోమూత్రం బాటిళ్ళుగా సాగిపోతోంది.

Must Read: గూగుల్, ఫేస్‌బుక్ లను తలదన్నే ఆలోచన చేసిన ఇండియన్ కంపనీ

(Visited 1,476 times, 1 visits today)