Home / Reviews / సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు రివ్యూ & రేటింగ్.

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు రివ్యూ & రేటింగ్.

Author:

Seethamma Andalu Ramayya Sitralu Movie Review

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ వంటి హ్యాట్రిక్ హిట్స్ ని సొంతం చేసుకొని కెరియర్ ని జెట్ స్పీడ్ తో నడిపిస్తున్న రాజ్ తరుణ్ నుండి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం లో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించిన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అదో అందమైన పల్లెటూరు అందులో సీతామాలక్ష్మి (అర్తన) , శ్రీరామ్ (రాజ్‌తరుణ్) చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా పెరుగుతారు..మన శ్రీరామ్ కు మాత్రం సీతామాలక్ష్మి అంటే అమీతమైన ప్రేమ.. కానీ శ్రీరామ్ అల్లరి చిల్లర గా తిరగడంతో సీతామాలక్ష్మికి నచ్చదు..ఆయన కానీ తనని ప్రేమంచమని వెంటపడుతుంటాడు…మనోడి చేష్టలకు ఎలాగో అలాగా ప్రేమలో పడుతుంది…అదే ఊరికి ప్రెసిడెంట్ అయిన సీతామాలక్ష్మి తండ్రి (రాజా రవీంద్ర) కి వీరి ప్రేమ తెలియడంతో , సీతామాలక్ష్మికి పెళ్లి సంబందం చూస్తాడు..ఇండియా క్రికెట్ టీం కు సెలెక్ట్ అయిన ఆదర్శ్ ను సీతామాలక్ష్మికి ఇచ్చి పెళ్లి చేయాలనీ అనుకుంటాడు..ఈ లోపు శ్రీరామ్ వెళ్లి ఆదర్శ్ కు తమ ప్రేమ వ్యవహారం చెపుతాడు..అయితే ఆదర్శ్ మాత్రం తనతో క్రికెట్ ఆడి గెలిచి సీతామాలక్ష్మి సొంతం చేసుకొమ్మని పందెం వేస్తాడు..పందెం కు సై అన్న శ్రీరామ్ గెలుస్తాడా లేదా..? సీతామాలక్ష్మి ఎలా దక్కించుకుంటాడు..? అనేది మిగతా స్టొరీ…

అలజడి విశ్లేషణ:

ఎంచుకున్న అసలు కథనే మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్‌లు ప్రేమించుకోవడం, వారి ప్రేమకు కొన్ని పరిస్థితులు, వ్యక్తులు అడ్డురావడం, వీటన్నింటినీ ఎదిరించి హీరో తన ప్రేమను సొంతం చేసుకోవడం అన్న బేసిక్ లైన్ రొటీన్,అసలు సమస్య ఈ బేసిక్ లైన్‌కు క్రికెట్‌ను కలిపి, క్రికెట్ పందెంలో గెలిచిన వారికి అమ్మాయి సొంతం అవుతుందన్న ఆలోచన ఏమాత్రం బాలేదు.ఇక రామ్, సీతల ప్రేమకథలో పెద్దగా ఎమోషన్ లేదు. హీరోయిన్, హీరో ప్రేమలో పడిపోవడం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. రామ్ పాత్రను పక్కనబెడితే మిగతా అన్ని పాత్రలకూ సరైన పాత్ర చిత్రణ లేదు. పూర్తిగా కామెడీనే నమ్ముకోవడం అనే అంశం వల్ల కొన్నిచోట్ల సన్నివేశాల్లో అతి ఎక్కువ అయింది.

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే హీరో రాజ్ తరుణ్ అనే చెప్పుకోవాలి. తనదైన మార్క్ డైలాగ్ డెలివరీతో, ఎక్కడా నెమ్మదించని యాక్టింగ్ స్కిల్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను తన భుజాలపై మోసుకొచ్చాడు. ఇక హీరోయిన్‌గా నటించిన అర్తన చాలా అందంగా ఉండడంతో పాటు బాగా నటించింది. రొటీన్ కథనే వీరిద్దరూ తమ తమ ప్రెజెన్స్‌తో ఉన్నంతలో బాగా నడిపించారు. హీరో గ్యాంగ్‌లో భాగమైన షకలక శంకర్, నవీన్ తదితరులు బాగా నవ్వించారు. హీరోయిన్ తండ్రిగా నటించిన రాజా రవీంద్ర మంచి ప్రతిభ చూపారు. ఈ సినిమాకు హైలైట్ అంటే పంచ్ డైలాగులతో చాలా చోట్ల నవ్వించే ప్రయత్న చేయడం గురించి చెప్పుకోవచ్చు, ఇక సెకండాఫ్‌లో అసలు కథను మొదలుపెట్టి దానికి చివర్లో క్రికెట్ పందెం అనే అంశాన్ని జోడించి హీరో పాత్రకు ఒక టార్గెట్‌ను రూపొందించి కొన్ని చోట్ల కామెడీ పండించారు. క్రికెట్ ఆట చుట్టూనే సాగే క్లైమాక్స్ పార్ట్‌లో ఫన్ ఫర్వాలేదు. ఇక సినిమాలోని పాటలన్నీ వినడానికి, చూడడానికి బాగున్నాయి. ఈ పాటలు మంచి రిలీఫ్‌నిస్తాయి. సెకండాఫ్‌లోనే వచ్చే రెండు, మూడు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

నటీనటుల పని తీరు:

రాజ్ తరుణ్: రాజ్‌తరుణ్ ఎప్పటిలాగానే తన యాక్టింగ్ తో తనదైన మార్క్ డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు.

అర్తన : ఈ చిత్రం తో తొలిపరిచయం అయిన ఉన్నంతలో కాస్త ఆకట్టుకుంది.

హీరోయిన్ తండ్రి గా అలాగే ఆ ఊరికి ప్రెసిడెంట్ గా రాజా రవీంద్ర బాగానే ఆకట్టుకున్నాడు..ముఖ్యంగా శకలక శంకర్ కామెడీ థియేటర్స్ లలో ఈలలు వేయించింది.. మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి మిగతా నటినటులు వారి పాత్ర మేరకు బాగానే ఆకట్టుకున్నారు..

సాంకేతిక వర్గం పనితీరు:

ముఖ్యంగా గోపీసుందర్ అందించిన మ్యూజిక్ బాగుంది, అలాగే పల్లెటూర్ బ్యాక్ డ్రాప్ స్టొరీ కి ఏలాంటి బ్యాక్ గ్రౌండ్ అయితే బాగుంటుందో ఆది ఇచ్చి సక్సెస్ అయ్యాడు..అలాగే సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య రాసిన సాంగ్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి..

కెమరా విషయానికి వస్తే విశ్వ చాల అద్భుతంగా తన పనితనాన్ని నిరూపించాడు..హీరో , హీరోయిన్ లను అలగే పల్లెటూర్ అందాలను చాల చక్కగా తెరకెక్కించాడు..అక్కడక్కడ కాస్త బోర్ కొట్టించిన కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు.. దర్శకుడి గా మొదటి చిత్రం అయిన శ్రీనివాస్ గవిరెడ్డి ఎంచుకున్న కథ మాత్రం పాతదే…హీరో పందెం లో గెలిచి హీరోయిన్ ని సొంతం చేసుకోవడం వంటివి చాల సినిమాల్లో మనం ఇప్పటికే చూసాం..కాకపోతే స్క్రీన్‌ప్లే తో జాగ్రత్త పడ్డాడు..

ప్లస్ పాయింట్స్:

  • రాజ్ తరుణ్
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ
  • మాటలు

మైనస్ పాయింట్స్:

  • పాత చింతకాయ పచ్చడి లాంటి స్టొరీ లైన్
  • బోరింగ్ సెకండాఫ్
  •  క్లైమాక్స్
  • ఎడిటింగ్

అలజడి రేటింగ్: 2.5/5

పంచ్ లైన్: సీతమ్మ అందాలూ రామయ్య “పాత” సిత్రాలు.

(Visited 924 times, 1 visits today)