Home / Inspiring Stories / హమారా హైదరాబాద్..!

హమారా హైదరాబాద్..!

Author:

హైదరాబాద్…ఒక్కొక్క రుచినీ వడ్డించే అమ్మలా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. 500 రూపాయల భోజనం నుంచీ 4 రూపాయల సమోసావరకూ దేని ప్రత్యేకత దానిదే అన్నట్టు దేని రుచి దానిదే. ప్యారడైజ్ బిర్యానీ తిన్నాం కదా అని ఎస్వీకేఫ్ లో సమోసా వదిలేయలేం… దేని ప్రత్యేకత దానిదే. సొ…! ఏదీ మిస్సవ్వొద్దు.. చలో..! ఇవాల్టికి కొన్ని రుచి చూసేద్దాం.

ఉస్మానియా బిస్కెట్:

హైదరాబాద్ గల్లీల్లో ఏ కేఫ్ కైనా వెళ్లండి.ఏ మారు మూల ఏరియాకైనా వెళ్ళండి సగటున మీకు ప్రతీ 100 మీటర్ల దూరం లో దొరికే రెండు వస్తువులు ఒకటి చాయ్ ఐతే మరోటి బిస్కెట్. అదే ఉస్మానియా బిస్కెట్.చాయ్ తో కలిపి ఒక్క బిస్కెట్ తిన్నారా ఇక ఉస్”మేనియా” కి గురైనట్టే. ఒక్క బిస్కెట్ ఐనా తినకుండా మీ రోజు గడవదు. ఈ ఎగ్ ఫ్రీ బిస్కెట్లకు అంతర్జాతీయ స్తాయిలోనూ మంచి గిరాకీ ఉంది. ఉస్మానియా బిస్కెట్ హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగమైపోయింది..

chaibisket  హమారా హైదరాబాద్ osmania biscuit

మటన్ సమోసా:

మామూలుగా సమోసా అంటేనే దక్షిణ భారతదేశం లో ముందుగుర్తొచ్చేది హైదరాబాద్. ఇక్కడ మనం మామూలుగా వినే ఉల్లి సమోసా,అలూ సమోసా లే కాకుండా మటన్,మష్రూంస్ వంటి వాటితోనూ సమోసాలు తయారౌతాయ్… ఒక్కొక్క సమోసా లో మీరు ఊహించనంత రుచికరంగా ఉండేలా తయారు చేస్తారు ఇక్కడి వంటగాళ్ళు. ఈ మటన్ సమోసా రుచి ఏ హొటల్ కి ఆ హొటల్ మారుతూ ఉంటుంది.ఎందుకంటే ఎవరి రెసిపీ వారికే
ప్రత్యేకం మరి.

.హమారా హైదరాబాద్

లుక్మీ:

ఆంగ్ల పదం “లుక్ మీ” కీ ఈ వంటకానికి ఏ సంబందం లేకపోయినా కళ్ళని మాత్రం తనవైపు తిప్పుకుంటూనే ఉంటుంది. చూడటానికి చిన్న రొట్టెలా కనిపించే దీని మధ్యలో మాంసం తో చేసిన వంటకం ఉంటుంది. స్నాక్స్ లా చేసే ఈ లుక్ మీ ని తినాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఓల్డ్ సిటీ లోని కేఫ్ లకి గానీ,హొటల్స్ కి గానీ వెళ్ళాల్సిందే..

హమారా హైదరాబాద్ Lukhmi

 

షామీ రోటీ:

పేరు తలుచుకోగానే వెంటనే చార్మినార్ వైపు వెళ్ళేలా చేసే రుచి షామీ రోటీ. ఓల్డ్ సిటీ లోని షాలిబండ,చార్మినార్,చాదర్ ఘాట్ వంటి ప్రదేషాల్లో సాయత్రం అయిందంటే చాలు చుట్టుపక్క ప్రదేశాలన్నీ కమ్మటి వాసనలతో నిండిపోతాయ్. ఎక్కువగా మటన్ నే ఉపయోగిస్తారు ఐతే ఎక్కువగా పేదవాళ్ళు ఉండే ఏరియాల్లో మాత్రం ధరల దృష్ట్యా బీఫ్ కూడా వాడతారు. (బీఫ్ వాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ రాసి మరీ ఉంచుతారు) షామీ విత్ రోటీ తిన్నారా…! ఇక ఆ సాయంత్రం మీకు గుర్తుండి పోయే అరుదైన సమయాల్లో ఒకటి అయి తీరుతుంది.

హమారా హైదరాబాద్ lukhmi

కట్టీదాల్:

ఏ దాబాలో అయినా కనిపించే వంటకమే అయినా లోకల్ రుచి లోకలే దాల్,అన్నం.. మద్యలో ఒక మిరపకాయ్ గానీ లేదా ఒక చెగోడీ గానీ… తింటే జీవితం లో రుచేంటో అర్థం ఔతుంది మామూలు పప్పు వండటం లోనూ ఎంత నైపుణ్యం కావాలో అర్థమౌతుంది…

హమారా హైదరాబాద్

బోటీకబాబ్:

కబాబ్ ల సిటీ అనిపించుకునే డిల్లీ లో కూడా మీకీ టేస్ట్ దొరకక పోవచ్చు బోటీ కబాబ్ పేరు వినగానే ఇదివరకు రుచి చూసిన వాళ్లైతే ఇప్పటికే నోట్లోకి నీళ్ళొచ్చేసి ఉంటాయి.మేక లేదా పొట్టేలు లోపలి భాగాలు(బోటీ) ని పుల్లకు గుచ్చి వాటిని నిప్పుల మీద క్కల్చి తెచ్చే ఈ వంటకం మీ ఫేవరెట్ ఐపోతుంది కూదా… ఈ మద్య కబాబ్ మధ్యలో మష్రూం కూడా చేరుస్తున్నారు..

హమారా హైదరాబాద్
హలీం:

ఇక చెప్పటానికేముందీ ఇప్పటికే మీకు రంజాన్ మాసపు హైదరాబాద్ వాతావరణం కళ్ళముందు కదిలి ఉటుంది.. హలీం ఎన్నొ ప్రొటీన్ లతో కూడిన బలవర్థక ఆహారం. ముస్లింల ఉపవాస దినాలలో వండే ప్రత్యేక వంటకమే అయినా.ఇది అందరి ఫేవరెట్  హైదరబాదీ వంటకం గా అంతర్జాతీయ సాయిలో హలీం పేరు వినిపిస్తుంది. ఆహారపుటలవాట్లూ రెండు సంస్కృతులను దగ్గర చేస్తాయనేందుకు ఇదర్శనం హలీం..చార్మినార్ దగ్గరలోని మదీన హొటల్  హలీం కి పేరుగాంచింది.కేవలం రంజాన్ మాసం లోనే కాదు ఇప్పుడు అన్ని రోజుల్లోనూ దొరికుతోంది హలీం..

హమారా హైదరాబాద్ hyderabad haleem

పాయా:

హైదరాబాద్ బావర్చీ(నిపుణులైన వంట గాళ్ళు)ల నైపుణ్యాన్ని చూపే వంటకం పాయా. పొట్టేలు లేదా మేక కాళ్ళతో మాత్రమే చేసే ఈ వంటకం జీవితం లో ఒక్కసారైనా రుచి చూసి తీరాల్సిందే. తందూర్ రోటీ తో పాయా పాత్రలో ఈదేందుకు ఎంత మంది ఎదురు చూస్తారో. ఈ పాయాజాలం లో పడ్డారో..!ఇక నెలలో రెండుసార్లైనా మీరు అంబర్ పేట్,చాదర్ ఘాట్, బహదూర్పురా కి వెళ్ళి తీరతారు..

హమారా హైదరాబాద్

బిర్యానీ:  ……………….నాకు బాగ ఆకలేస్తోంది…!

హమారా హైదరాబాద్ hyderabad biryani

ఇవే కాదు ఇంకా ఎన్నో రుచులు షీర్ ఖుర్మా,కుభానీ కా మీఠా,కద్దు కీ ఖీర్,డబల్ కామీఠా,చికెన్
హరీస్,ఇలా ఇంకా చాలా రుచులు  జీవితపు రుచితో సహా చూపిస్తుంది శహర్.. హైదరాబాద్.. హమారా హైదరాబాద్. వచ్చేవారం ఇంకో టాపిక్ తో కలుద్దాం. . . .

(Visited 331 times, 1 visits today)