Home / Videos / శాకాహారానికీ, ఆధ్యాత్మికత కూ లింక్ పెట్టడంలో అర్ధం లేదు.

శాకాహారానికీ, ఆధ్యాత్మికత కూ లింక్ పెట్టడంలో అర్ధం లేదు.

నేను గోమాంసాన్ని చాలా సార్లు తిన్నాను మళ్ళీ మళ్ళీ తింటాను, ఏం చేస్తారో చేసుకొండంటూ సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలతో ఒక పక్క భజరంగ దళ్, విశ్వ హిందూ పరిషద్ ఆందోళనలు చేస్తుంటే, మరో పక్క ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పౌరాణిక ప్రవచన కర్త గరికపాటి నరసింహా రావు- శాకాహారులకు , మాంసాహారులకు చేసిన సూచనలు, వినతులతో కూడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గోవు హిందువుల సెంటిమెంట్ కు సంబంధించిన వ్యవహారమని తెలిసీ కూడా మార్కండేయ కట్జూ ఆ రకమైన వ్యాఖ్యలు చేయటాన్ని హిందూ సమాజం తప్పు పడుతుంటే, కట్జూ స్థాయిలో కాదు కానీ…కాస్త అటూ ఇటూగా అదే మాదిరి సరదా విశేషణాలతో …సంచలన పౌరాణిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ఇష్టాగోష్టిగా మాట్లాడిన సంభాషణలతో కూడిన వీడియో ఇప్పుడు వెబ్ లో స్వైరవిహారం చేస్తోంది. రాముడు, కృష్ణుడు క్షత్రియులు కాబట్టి వారు మాంసాహారం తిన్నారనీ, అలాగని బ్రాహ్మణులు మాంసాహారం తినక్కరలేదని, కానీ మిగిలిన అన్నీ కులాల వారు మాంసాహారం తినటం లో తప్పేమీ లేదని గరికపాటి వివరించారు. శాకాహారానికీ, ఆధ్యాత్మికతకూ లింక్ పెట్టడం లో అర్ధం లేదని కూడా ఆయన వాకృచ్చారు. అలాగని ఆయన నేరుగా గో మాంసం తినొచ్చని చెప్పలేదు కానీ, తింటే ఏమిటనే దానికి మాత్రం జవాబు దాటవేశారు. అన్య కులస్తులందరూ మాంసాహారం మానేసి బ్రాహ్మణులైపోతే, మా వృత్తులు పోతాయంటూ గరికపాటి చమత్కరించారు. “రాముడు మాంసం తినాలి…వశిష్టుడు తింటే మాత్రం తప్పు..” అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన గరికపాటి , కాస్త అటూ ఇటూగా కట్జూ చెప్పిందే చెప్పారంటూ కొందరు పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

(Visited 666 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]