Home / Entertainment / ‘శంకరాభరణం’ పాట వినిపించిన చైతు.

‘శంకరాభరణం’ పాట వినిపించిన చైతు.

Author:


ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ స్క్రిప్ట్ తో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉదయ్ నందనవనం దర్శకత్వంలో హ్యాట్రిక్‌ హిట్స్‌తో జోరు మీదున్న నిఖిల్ హీరోగా,రూపొందించిన సినిమా ‘శంకరాభరణం’. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ ఈ సినిమాకు భారీ అంచనాలను తెచ్చి పెట్టాయి. సరికొత్త కాన్సెప్ట్‌తో క్రైమ్ మరియు కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమ ఈ సీజన్‌కు రానున్న సినిమాల్లో ఒక క్రేజీ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. తాజాగా నాగ చైతన్య శంకరాభరణం సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.ఆడియోలో లేని ఈ సాంగ్‌ను నాగచైతన్య ప్రత్యేకంగా ఓ ఈవెంట్‌లో శంకరాభరణం టీమ్ కోరిక మేరకు విడుదల చేశారు. నగచైతన్య విడుదల చేసిన ఈ పాట సినిమాలో పతాక సన్నివేశాల సమయంలో వస్తుందని కోన వెంకట్ తెలుపుతూ, సాంగ్‌ను లాంచ్ చేసిన నాగ చైతన్యకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు.

మొదట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా టీజర్‍ను లాంచ్ చేసి ‘శంకరాభరణం’ టీమ్‌కు విషెస్ చెప్పగా, ఆ తర్వాత రానా కూడా ఓ సాంగ్‌ను లాంచ్ చేసి సినిమాకు ప్రచారం కల్పించారు..సినిమాకు పలువురు టాప్ హీరోలు ప్రచారం కల్పించడం మరింత హైప్ తెచ్చిపెట్టింది.ఈ సినిమాకు పలువురు టాప్ హీరోలు ప్రచారం కల్పించడంతో మరింత హైప్ తెచ్చిపెట్టింది.కోన వెంకట్ మాట్లాడుతు, నగచైతన్య విడుదల చేసిన ఈ పాట సినిమాలో పతాక సన్నివేశాల సమయంలో వస్తుందని,అలాగే సాంగ్‌ను లాంచ్ చేసిన నాగ చైతన్య ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు. ‘శంకరాభరణం’ సినిమా డిసెంబర్ 4న పెద్ద ఎత్తున విడుదల కానుంది.

(Visited 45 times, 1 visits today)