Home / Entertainment / శంకరాభరణం పాడతారట.

శంకరాభరణం పాడతారట.

Author:

Shankarabharanam cinema audio releasing on october 30th శంకరాభరణం

అరే..! ఏ క్యాహై మున్నాభాయ్…! అంటూ హైదరాబాద్ నవాబ్స్ చిత్రంలో రెండు నిమిషాల పాత్రలో కనిపించిన యువకుడు నిఖిల్ ఎప్పటికైనా హీరో అవాలనే తన కలని నెరవేర్చుకునే ప్రయత్నం లో ప్రయత్నించీ,ప్రయత్నించీ హ్యాపీడేస్ చిత్రం ద్వారా తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. హ్యాపీడేస్ సినిమా ఇచ్చిన బ్రేక్ ని చక్కగా వినియోగించుకున్న నటుల్లో తమన్నా,వరుణ్ సందేష్ లతో పాటు నిఖిల్ కూడా తన కెరీర్ ని చక్కటి ప్లానింగ్ తో నడిపిస్తున్నాడు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ ప్రస్తుతం మరో విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నారు.

‘శంకరాభరణం’ పేరుతో కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ‘గీతాంజలి’ వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇది. పుణేకి 60 కిలో మీటర్ల దూరంలోని బోర్, నగరి, వాయ్ గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. ఈ మధ్యే నటుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన శంకరాభరణం టీజర్ కూడా చక్కటి ప్రశంసలని రాబట్టింది. ఈ అక్టోబర్ 30న శంకరాభరణం  ఆడియోను, దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ మెరకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు కూడా.

ఇదొక క్రైమ్ కామెడీ మూవీ. బీహార్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే.. యూఎస్ కి చెందిన అత్యంత సంపన్నుడి కొడుకు హీరో నిఖిల్. ఈ ప్రపంచంలో సుఖపడే వాళ్లు, కష్ట పడి పని చేసే వాళ్లు.. ఈ రెండు జాతులే ఉంటాయన్నది హీరో నమ్మకం. తాను సుఖపడటానికే పుట్టానన్నది అతని ఫీలింగ్. అలాంటి అతను ఓ పని మీద ఇండియా వచ్చి, అనుకోకుండా కష్టాల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడనే కథాంశంతో సినిమా సాగుతుంది. ఇందులో అంజలి స్పెషల్ క్యారెక్టర్ చేసింది. సుమన్, సితార, రావు రమేశ్, సప్తగిరి.. ఇలా మొత్తం 40 మంది ప్రముఖ నటీనటులు నటించారు.నందిత కథానాయికగా నటించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ‘గీతాంజలి’ వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

(Visited 54 times, 1 visits today)