Home / Reviews / శంకరాభరణం సినిమా రివ్యూ & రేటింగ్.

శంకరాభరణం సినిమా రివ్యూ & రేటింగ్.

Shankarabharanam Movie Perfect Review and Rating

Alajadi Rating

2/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: నిఖిల్, నందిత, అంజలి..

Directed by: ఉదయ్ నందనవనం

Produced by: ఎంవివి సత్యనారాయణ

Banner: MVV Cinema.

Music Composed by: ప్రవీణ్ లక్కరాజు

హ్యాట్రిక్ హిట్స్ అందుకొని ఫుల్ జోరుమీదున్న యంగ్ హీరో నిఖిల్ స్టార్ రైటర్ కోన వెంకట్ తో కలిసి చేసిన సినిమా ‘శంకరాభరణం’. క్రైమ్ కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా నటించగా, అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నిఖిల్ కి మరో హిట్ గా నిలిచి సెకండ్ హ్యాట్రిక్ కి తెర తీసిందా లేదా? అన్నది? ఇప్పుడు చూద్దాం.

కథ:

యుఎస్ లో మిలియన్ డాలర్స్ కి అధిపతి అయిన సుమన్ వారసుడు గౌతమ్(నిఖిల్). అందుకే లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ సుమన్ ని ఫ్రెండ్స్ ముంచేయడంతో ఆస్తి అంతా పోయి బ్యాంకుకి 12 కోట్లు కట్టాల్సి వస్తుంది. చనిపోదాం అనుకున్న సుమన్ ని ఆపి సితార తన పేరు మీద బిహార్ లో శంకరాభరణం అనే పాలెస్ ఉందని, దాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మని చెప్తుంది. దాంతో మన హీరో గౌతమ్ బీహార్ లో లాండ్ అవుతాడు.. అక్కడేమో అదే పాలెస్ లో సితారకి చెందిన ఫ్యామిలీ గత 15 ఏళ్ళుగా ఉంటుంటారు. వాళ్ళని ఎలాగోలాగా బురిడీ కొట్టించి పాలెస్ అమ్మేయాలని అన్నీ సెట్ చేసుకుంటాడు. కానీ ఈ లోగా అమెరికాలో గౌతమ్ రిచ్ కిడ్ అని తెలుసుకున్న బిహార్ లోని ఓ కిడ్నాప్ ముఠా గౌతమ్ ని కిడ్నాప్ చేసి డబ్బు ఇమ్మంటాడు.అసలే ఇబ్బందుల్లో ఉన్న గౌతమ్ అదే గ్యాంగ్ తో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేసి డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ టైములో తనకి తెలియకుండానే తను పలు సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఆ ప్లాన్ ఏంటి? ఈ ప్లాన్ వలన గౌతమ్ ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? ఫైనల్ గా ఈ కిడ్నాప్ గ్యాంగ్స్ నుంచి ఎలా తప్పించుకొని తన ఫ్యామిలీ సమస్యని తీర్చాడు? అలాగే శంకరాభరణం పాలెస్ ని అమ్మాడా లేదా అన్నదే మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

అలజడి విశ్లేషణ:

కోన వేంకట్ మొదటి నుండి కామెడిని అమ్ముకోని వస్తున్నడు తను చేప్పిందే వేదం తను రాసిందే కథ అయన ప్రోడ్యుస్ చేసిన సినిమాలు మాత్రమే సినిమాలు మిగతవి కావు అన్నాట్టు చేస్తాడు.ఇక తను రాసిన కథ హిట్ కాలేదనుకో నేను రాసిన కథ నాకు తేలియకుండనే మార్చారు అనే రకం హిట్ అయితే మాత్రం మీడియ ముందు అంత నా క్రేడిట్ అనే రకం. ఇక ఇప్పుడు హింది సినిమా అయిన  ‘పస్ గయారే ఒబామా’ అనే సినిమాకి స్పూర్తిగా తెలుగులో శంకరాభరణం సినిమా రీమేక్ అయ్యింది.

కథలో మార్పులు చేయాలని చాలా పాత్రలని, ఫ్యామిలీ ఎమోషన్స్ ని సృష్టించారు. ఈ శంకరాభరణం సినిమాలో కూడా చాలా వరకూ ఆ కామెడీ ఫ్లేవర్ వర్కౌట్ అవ్వడమే సినిమాకి కొంత ప్లస్. ఫస్ట్ హాఫ్ లో అయితే పాత్రలు పరిచయం అవుతూ ఉంటాయి, అందులో చాలా పాత్రలు నవ్విస్తాయి. హీరోగా చేసిన నిఖిల్ మరోసారి తనకి ఇచ్చిన పాత్రలో ఒదిగిపోగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. కన్ఫ్యూస్డ్ ఇండియన్ దేశీగా తన హావ భావాలతో కామెడీ పండించి ఆకట్టుకున్నాడు. చూడటానికి స్టైలిష్ లుక్ లో, ఎన్నారైగా మానరిజమ్స్ బాగానే చూపించాడు. హీరోయిన్ నందిత ఫన్ లవింగ్ గర్ల్ గా బాగానే నవ్వించి, తన పాత్రకి న్యాయం చేసింది. ఇక గెస్ట్ రోల్ లో బందిపోటు రాణి మున్నిగా అంజలి చాలా బాగా చేసింది. తన పాత్ర వలన సినిమాలో కాస్త వేగం పెరుగుతుంది. ముఖ్యంగా సప్తగిరి, శకలక శంకర్, సత్యం రాజేష్ లతో సంజయ్ మిశ్రా చేసిన కామెడీ, పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటే, మరోవైపు హీరోకి ఎదురయ్యే సమస్యలు, దానికి అతను రియాక్ట్ అవుతుండే విధానం కూడా ఆడియన్స్ కి నవ్వు తెప్పిస్తుంటుంది. దీనివలన సినిమా స్టార్టింగ్ బాగుంటుంది.

ఇక సెకండాఫ్ లో ప్రుద్వి రాజ్ పంచ్ డైలాగ్స్ మరియు కిడ్నాప్ ఎపిసోడ్స్ కొన్ని బాగా నవ్వు తెప్పిస్తాయి. క్లైమాక్స్ లో సంపత్ రాజ్ పాత్ర, అతనిఎదుర్కునే సందర్భాలు చివర్లో ఆడియన్స్ ని నవ్విస్తాయి. చెప్పాలంటే చివర్లో సంపత్ రాజ్ ఎక్కువగా నవ్విస్తాడు. ముఖ్య పాత్రలు చేసిన రావు రమేష్, సుమన్, సితార, రఘుబాబులు తమ పాత్రల పరిదిమేర నటించారు. ఈ సినిమా ద్వారా పరిచయం అయిన గజి మరియు పూజ కపూర్ లు ఇద్దరూ పర్ఫెక్ట్ గా వారి పాత్రలకి సెట్. ఒక రీమేక్ సినిమాని ఏదో డెవలప్ చేసి ఎలా చెడగొట్టచ్చు అన్నదానికి ప్రతీకగా ఈ శంకరాభరణం సినిమాని చెప్పుకోవచ్చు.

కథలో చేసిన మార్పుల్లో వర్కౌట్ అయ్యింది చాల తక్కువ, కథ తర్వాత కథనం కూడా ఆకట్టుకునేలా లేకపోవడం సినిమాకి మరో మైనస్. మొదటి 20 నిమిషాల్లోనే మిగతా 2 గంటల కథ దేని కోసం జరగనుందనే క్లారిటీ ఆడియన్స్ కి వచ్చేస్తుంది. దానికి తోడు సినిమాలో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ కూడా ఏమీలేకపోవడం వలన చాలా చోట్ల బోరింగ్ గా ఉంటుంది. అలాగే సినిమాలో పాటలు సినిమా వేగాన్ని మరింత దెబ్బతీసేలా ఉన్నాయి. ఉదాహరణకి సెకండాఫ్ మొదలవ్వగానే వచ్చే పాట, అంజలి పాత్రని హైలైట్ చెయ్యాలని పెట్టిన పాట, ఈ పాటలు సినిమాకి అవసరం లేదు ముఖ్యంగా కోన వెంకట్ నాకు ఒరిజినల్ వెర్షన్ లోని హీరో గేమ్ ప్లాన్ నచ్చింది, అదే ఈ సినిమాకి తీసుకున్నాను అని చాలా చోట్ల చెప్పాడు, కానీ కొత్తగా అనిపించే ఆ పాయింట్ నే ఈయన అటూ ఇటూ మార్చేసి ఒరిజినల్ ఫ్లేవర్ ని మిస్ చేసేసాడు. రీమేక్ అంటే అక్కడి మేజిక్ ని ఇక్కడ రీక్రియేట్ చేయాలి, లేదా ఇక్కడ యాడ్ చేసుకున్న సీన్స్ తో అన్నా మేజిక్ చెయ్యాలి. కానీ శంకరారభణంలో ఒరిజినల్ వెర్షన్ లోని ఫీల్ మిస్ అయ్యింది, అలాగే జత చేసిన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు.

నటీనటుల ప్రతిభ:

నిఖిల్ :  హీరోగా చేసిన నిఖిల్ మరోసారి తనకి ఇచ్చిన పాత్రలో ఒదిగిపోగలనని మరోసారి ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. కన్ఫ్యూజ్ ఇండియన్ దేశీగా తనహావ భావాలతో కామెడీ పండించి ఆకట్టుకున్నాడు.చూడటానికి స్టైలిష్ లుక్ లో, ఎన్నారైగా మానరిజమ్స్ బాగానే చూపించాడు.
నందిత : హీరోయిన్ నందిత ఫన్ లవింగ్ గర్ల్ గా బాగానే నవ్వించి, తన పాత్రకి న్యాయం చేసింది.
సంపత్ : నెగటివ్ షేడ్స్ ఉన్న హోం మినిష్టర్ గా కనిపించే సంపత్ నటన బాగుంది. చెప్పాలంటే చివర్లో సంపత్ రాజ్ ఎక్కువగా నవ్విస్తాడు.

ఇక గెస్ట్ రోల్ లో బందిపోటు రాణి మున్నిగా అంజలి చాలా బాగా చేసింది. తన పాత్ర వలన సినిమాలో కాస్త వేగం పెరుగుతుంది. కమెడియన్స్ అయిన సప్తగిరి, పృథ్వి రాజ్, సంజయ్ మిశ్రా, హర్షల పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

హిందీలో వచ్చిన సూపర్ హిట్ బొమ్మ ‘పస్ గయారే ఒబామా’ అనే సినిమాకి అధికారిక రీమేక్ గా చెప్పుకునే సినిమా ఈ శంకరాభరణం. కోన వెంకట్ ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసాడు. కానీ ఎందులోనూ సక్సెస్ కాలేదు. ఒరిజినల్ కథలో ఉన్న ఫ్రెష్ నెస్ కి తన మార్క్ పైత్యాన్ని జత చేసి మొదట కథని చేడగొట్టేసారు. కథకి అవసరమే లేని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ని ఒకదానిని క్రియేట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా దాని మీదే నడిపించారు. కథనం – కొద్దిసేపటికే కథలోని మెయిన్ మెయిన్ బ్లాక్స్, సస్పెన్స్ వచ్చేయడం వలన ఆ తర్వాత ఆడియన్స్ తెసుకోవాల్సింది ఉండదు. అందుకే ఫస్ట్ హాఫ్ సగం నుంచే బాగా రొటీన్ గా అనిపిస్తుంది.దర్శకత్వ పర్యవేక్షణ పరంగా చూసుకుంటే ఇంకా ఎక్కువగా ఉదయ్ నందనవనంని గైడ్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. ఉదయ తనకిచ్చిన స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా తీసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేశాడే తప్ప ఆన్ స్క్రీన్ పైకి వస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా పడుతున్నాయా లేదా అన్నది చూసుకోలేదు. . డైరెక్షన్ పరంగా వెరీ వీక్ టేకింగ్. కోన నుంచి ఇంతకన్నా వరస్ట్ మళ్ళీ ఆశిచలేం అనే చెప్పాలి. లాజికల్ పరంగా చూసుకుంటే.. పేరుకి పెద్ద కిడ్నాపర్స్ కానీ ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంటారు? ఎలా అంటున్నా? అలాగే రావు రమేష్ చదువుకున్నాడు అని చెప్తారు కానీ విసా పేపర్స్ అని నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తే కూడా చూడడు, పైగా చదువుకొని వాళ్ళలా వేలి ముద్ర వేస్తాడు. అలాగే హీరో – హీరోయిన్ మధ్య ఒక్క లవ్ సీన్ కూడా ఉండదు కానీ చివర్లో ఇద్దరికీ ప్రేమ వచ్చేస్తుంది. అలాగే ఒరిజినల్ వెర్షన్ లోని కంటెంట్ ని ఇప్పటికే చాలా మంది తెలుగు సినిమాల్లో వాడేసుకోవడం వలన ఆకిక్ కూడా దొబ్బింది.

స్టార్టింగ్ లో ఉన్న ఫ్లో మధ్యలో మధ్యలో మిస్ అవుతోందా? లేదా అన్నది కూడా చూసుకోలేదు. ముందుగా ఎన్నారై లొకేషన్స్ తో సినిమాని స్టార్ చేసి, ఆ తర్వాత బిహారీ మూడ్ లోకి ఆడియన్స్ ని తీసుకెళ్ళిపోయి, బిహారీ నేపధ్యాన్ని చూపించడంలో సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఆ విజువల్స్ కి, సినిమాలోని సీన్స్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా ప్రవీణ్ లక్కరాజు రీ రికార్డింగ్ చేసాడు. తను చేసిన పాటలు కూడా అంత బాగాలేవు. అలాగే అవివచ్చే సందర్భాలు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. చిన్న తన ఆర్ట్ వర్క్ లో బిహార్ నేటివిటీని పర్ఫెక్ట్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాలేదు. ఎక్కడా స్పీడ్ ఎడిట్ కనిపించలేదు, అలాగే చాలా లాగ్స్ ని కట్ చేసి ఉండొచ్చు. విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఓకే ఓకే అనేలా ఉన్నాయి. ఎంవివి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మెచ్చుకోదగిన విధంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • కామెడీ
  • నిఖిల్
  • సినిమాటోగ్రఫీ
  • రీ రికార్డింగ్

మైనస్ పాయింట్స్:

  • కథ,కథనం
  • డైరెక్షన్
  • ఎడిటింగ్
(Visited 120 times, 1 visits today)