Home / Entertainment / మొదటిసారి పోలీస్ గా కనిపించబోతున్న శర్వానంద్.

మొదటిసారి పోలీస్ గా కనిపించబోతున్న శర్వానంద్.

Author:

ప్రతిసారి సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ మరో వినూత్న ప్రయోగం చేయబోతున్నాడు. వరుసగా రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మరియు ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాల విజయంతో మంచి ఊపు మీదున్నాడు ఈ కుర్ర హీరో. దర్శకుడిపై నమ్మకంపై కంటే కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ యువ హీరో మరో నూతన దర్శకుడితో తన 25వ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్న చంద్రమోహన్, శర్వానంద్ తో మొదటి సారిగా పోలీస్ పాత్ర చేయించ బోతున్నాడు. ఈ సినిమాకి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు,సినిమా టైటిల్ టైటిల్ ఇంకా ప్రకటించలేదు గాని ఈరోజు రిలీజ్ చేసిన ఫోటోలో శర్వానంద్ ఒక పోలీస్ జీపు పక్కన స్టైలిష్ లుక్ నిలబడి ఉన్నాడు.

Sharwanand-new-movie

శర్వానంద్ పోలీస్ గా చేస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేస్తుంది, ఈ సినిమా డైరెక్టర్ ఇంతకముందు ప్రేమ కథలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన కరుణాకరణ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు, ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ రతన్ అందిస్తున్నాడు, సినిమాటోగ్రఫీని కార్తికేయ సినిమాకి పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని అందిస్తున్నాడు, కొత్త కొత్త కథలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన శర్వానంద్ ఈసారి మరో హిట్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలి అని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

(Visited 138 times, 1 visits today)