Home / Entertainment / రాజాధిరాజాగా వస్తున్న శర్వానంద్.

రాజాధిరాజాగా వస్తున్న శర్వానంద్.

Author:

RajaDhi Raja

హీరో శర్వానంద్ తెలుగు పరిశ్రమకు దొరికిన ఒక మంచి నటుడు. శర్వానంద్ ఎంచుకునే సినిమాలు చాలా ఢిఫరెంట్ గా ఉంటాయి. ఈ మద్య వరుస హ్యాట్రిక్ హిట్స్ ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ తో దూసుకుపోయాడు. ఇప్పుడు తాజాగా తెలుగులో విజయవంతమైన నా ఆటోగ్రాఫ్ తమిళ సినిమాను తెరకెక్కించిన సెన్సిబుల్ డైరెక్టర్ చేరన్ దర్శకత్వంలో నిత్యమీనన్ హీరోయిన్ గా ‘రాజాధిరాజా’ సినిమా ద్వారా వస్తున్నాడు. డైరెక్టర్ చేరన్ ప్రతి సన్నివేశాన్ని బ్యూటీఫుల్ గా తెరకెక్కించరని వినికిడి. మార్చి రెండో వారంలో జి.వి.ప్రకాష్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల చేసి మార్చి మూడోవారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్.వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమవుతుంది.

(Visited 121 times, 1 visits today)