Home / Latest Alajadi / అమ్మాయిలని వేధించే పోకిరీల ఆటకట్టించే షీటీమ్స్ ఏర్పాటై నేటికి రెండు సంవత్సరాలు.

అమ్మాయిలని వేధించే పోకిరీల ఆటకట్టించే షీటీమ్స్ ఏర్పాటై నేటికి రెండు సంవత్సరాలు.

Author:

తెలంగాణ లో షీ టీమ్స్ ఏర్పడి ఈరోజుకి రెండేళ్లు పూర్తయ్యాయి. ఆడవారిపై జరుగుతున్న అరాచకాలను, వేదింపులను ఆపడానికి వారికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఏర్పటు చేసినా షీ టీమ్స్ విజయవంతమయ్యాయి. హైదరాబాద్ లో మహిళలు స్వేఛ్చగా, నిర్భయంగా తిరుగుతున్నారంటే ఆ ఘనత షీ టీం కే దక్కుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

2-years-of-she-teams

24 గంటలు మహిళలకు రక్షణ కల్పించే ఈ షీ టీమ్స్, ఈ రెండేళ్లలో 800 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. ఇందులో 222మంది మైనర్లున్నారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ కేసులు, 40 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు పెట్టినట్టు సీపీ స్వాతి లక్రా చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలు ఎటువంటి భయం లేకుండా 100 కి ఫొన్ చేసిగాని, ఈ మెయిల్ ద్వార గాని, సోషల్ మీడియా ద్వారా కూడా మహిళలు ఫిర్యాదు చేయవ్చ్చు. షీ టీమ్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మహిళలపై 20శాతం నేరాలు తగ్గాయని ఈ ప్రొగ్రాం ను ఇతర రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేసేందుకు… అక్కడి అధికారులు వచ్చి స్టడీ చేశారన్నారు స్వాతి లక్రా.

(Visited 117 times, 1 visits today)