Home / Entertainment / రాధిక ఆప్టే ‘ప్రెగ్నెన్సీ’ఆదరగొడుతుంది

రాధిక ఆప్టే ‘ప్రెగ్నెన్సీ’ఆదరగొడుతుంది

Author:

సంచలన తార వార్తల్లో ఉండే రాధిక ఆప్టే..సినిమాల కంటే షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ తో ఫేమస్ అయింది. సినిమాల్లో అయినా యాడ్స్ లో అయినా రాధిక చాలెంజింగ్ పాత్రను పోషిస్తూ నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుంటుంది. ‘అహల్య’ షార్ట్ ఫిలిం లో సెక్సీ యాంగిల్ లో కుర్రకారు మదిని బ్లాక్ చేసిన రాధిక తాజాగా ఓ ‘ప్రెగ్నెన్సీ’ లేడీగా ఆదరగొట్టింది. మహిళలు పెళ్లి, ప్రెగ్నెన్సీ సమయంలో తమ ఉద్యోగాలకు దూరమవుతున్నారు. తమకు పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా పనిలో ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పినా సంస్థలు అందుకు అంగీకరించవు. ఈ సమస్య కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే మహిళలకు ఎదురవుతుంది.

ఓ ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ వింటర్ జాకెట్ ప్రకటన కోసం చేసిన యాడ్ లో రాధిక గర్భవతిగా కనిపిస్తుంది. తనకు ఎంతో ముఖ్యమైన ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న రాధిక గర్భవతి అనే కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఈ యాడ్ లో రాధిక ఆమె బాస్ మధ్య జరిగే సంభాషణ ఉంటుంది. ‘నైస్ జాకెట్..’అంటూ మొదలయ్యే ఈ యాడ్ లో బాస్ రాధికను ఉద్యోగం నుంచి తీసేసే విషయంపై మాట్లాడుతుంది. చివరికి తాను సొంత సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి బాస్ కి షాక్ ఇస్తుంది. రాధిక నటించింది ఒక చిన్న యాడ్ అయినా తన నటనకు ఫుల్ క్రేజ్ వచ్చింది.

(Visited 137 times, 1 visits today)