Home / Entertainment / కాల్షీట్స్ లో కన్నడ నటుడు రికార్డు

కాల్షీట్స్ లో కన్నడ నటుడు రికార్డు

Author:

shivarajkumar

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కన్నడ చిత్ర సీమలో నంబర్ 1. తమిళ్, తెలుగులో కూడా సుపరిచితమే, రాజ్ కుమార్ వారసుడిగా కన్నడ చిత్ర సిమాలో అడుగు పెట్టాడు. తర్వాత తనదైన నటన తో ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఇప్పుడు హీరోగా దేశ చలన చిత్ర రంగంలో ఒక కొత్త రికార్డుని సృష్టించాడు. కన్నడ చిత్రాల్లో ఇప్పటికే వందకు పైగా చిత్రాలలో నటించిన శివరాజ్ కాల్షీట్స్ మరో పదేళ్ళ వరకు ఫుల్ అయిపోయానని తెలుస్తుంది. ఇప్పటికే ‘జోగయ్య’ చిత్రంతో వంద సినిమాలను పూర్తి చేసుకున్న శివరాజ్ ఇటీవలే నటించిన కిల్లింగ్ వీరప్పన్, శివలింగ అనే చిత్రాలు కూడా విడుదలకి సిద్దంగా ఉన్నాయి. మాములుగా ఎంత పెద్ద సూపర్ స్టార్ అయిన ఒకటి రెండు లేదా మూడు సంవత్సరాలు కాల్షీట్స్ దొరకకుండా ఉండొచ్చేమో కాని మరీ వరుసగా పది సంవత్సరాలు కాల్షీట్స్ కూడా దొరకకుండా షూటింగ్ లతో బిజీగా ఉండటం సినిమా పరిశ్రమలో హీరో శివరాజ్ తోనే మొదలైంది. ఒకవేళ శివరాజ్ డేట్స్ ఇప్పుడు సర్దుబాటు చేసుకోవాలన్నా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కబీరా అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న శివరాజ్, మరోపక్క ఆర్యన్ తో కలిసి మరొక చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇలా ఏడాదికి మన ఈ సూపర్ స్టార్ మూడు సినిమాలను మాత్రమే చేస్తానని ఇటివలే ప్రకటించాడు. ఈ లెక్కన పది ఏళ్ళ వరకు కాల్షీట్స్ దొరకటం లేదంటే శివరాజ్ దాదాపుగా 30 సినిమాలకు సైన్ చేసినట్లు అర్ధం అవుతుంది.

(Visited 122 times, 1 visits today)