Home / Reviews / శౌర్య సినిమా రివ్యూ & రేటింగ్.

శౌర్య సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Shourya Movie Review and Rating

దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అయిన నటుడు మంచు మనోజ్. తోలి సినిమా నుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.మిస్టర్ పర్ ఫెక్ట్ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు దశరథ్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘శౌర్య’. ఒక ప్రేమకథకి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ని మిక్స్ చేసి చేసిన ఈ సినిమాలో రెజీన కసాండ్ర హీరోయిన్ కాగ మల్కాపురం శివకుమార్ నిర్మాత,  ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసిందా లేదా అనేది చూడండి..

కథ :

శౌర్య (మంచు మనోజ్ ) 300 కోట్ల బిజినెస్ కాంట్రాక్ట్ ను తన ఫ్రెండ్ కు వదిలిపెట్టి నేత్ర ( రెజినా ) ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. ఇద్దరు UK వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు..ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజు గుడిలో జాగారం చేసే అలవాటున్న నేత్ర , ఈ ఏడాది కూడా అలాగే జాగారం చేసి UK వెళ్ళాలని అనుకుంటుంది. దానికి శౌర్య కూడా ఒప్పుకొని శివాలయంలో నిద్రిస్తుంటారు..అదే టైం లో సడెన్ గా నేత్ర గొంతు కోయడం తో పెద్దగా అరుపులు , కేకలు వినిపిస్తాయి. వెంటనే నేత్ర ను హాస్పటల్ కు తీసుకవెళ్ళతారు.

కట్ చేస్తే..బెనర్జీ నేత్ర తరుపున మాట్లాడుతూ..శౌర్య నే నేత్ర ని చంపడానికి ప్లాన్ చేశాడని పోలీసులకు చెప్పడం తో శౌర్య ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన పోలీసులకు ఓ నిజం తెలుస్తుంది..ఆ నిజం ఏంటి..? నేత్ర ను చంపాలనుకుంది ఎవరు..? నేత్ర , శౌర్య ఎలా కలుసుకున్నారు..అనేది మిగత స్టొరీ..

అలజడి విశ్లేషణ:

దశరథ్ సినిమాలు అనగానే సంతోషం , సంబరం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఫ్యామిలీ చిత్రాలు గుర్తుకు వస్తాయి. శౌర్య చిత్రాన్ని కూడా ఫ్యామిలీ కథగానే రాసుకున్నాడు కానీ కథ లో అనేక ట్విస్ట్ లు పెట్టేసరికి ప్రేక్షకుడు కాస్త కన్ఫుజన్ కు గురియ్యాడు. ఫస్ట్ హాఫ్ అంత ట్విస్ట్ లు కాస్త స్లో నారేషన్ తో నడిపించిన సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథ లో వేగం పెంచి , ట్విస్ట్ లను రివేల్ చేసి ఓకే అనిపించాడు. లవ్, థ్రిల్స్ రెండు మిక్స్ చేయాలనే ఆలోచనలో చివర్లో వచ్చే థ్రిల్స్ బాగా రాసుకున్నారు, కానీ మిగతా పార్ట్ ని సరిగా రాసుకోలేదు. అందుకే సినిమా చాలా వరకూ బాగా బోరింగ్ గా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్. చాలా నిదానంగా సాగుతుంది.

మంచు మనోజ్ చూడటానికి బాగా బొద్దుగా, అమాయకుడిగా కనిపిస్తాడు. అమాయకంగా కనిపిస్తూ, ఇంటర్వెల్ లో తనలోని ఇంకో షేడ్ ని రివీల్ చేసే సీన్ మరియు అందులో మనోజ్ పెర్ఫార్మన్స్ సూపర్బ్. మనోజ్ ఎంచుకున్న పాత్రకి పూర్తి జస్టిఫికేషన్ చేసాడు. రెజీన ఈ సినిమాలో గ్లామర్ అనేది లేకుండా, చాలా హోమ్లీ లుక్ లో కనిపిస్తుంది. అలాగే నటనకు ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర కావడంతో తన నటనతో కథకి న్యాయం చేసింది. ఇక సినిమాలో కీలక పాత్ర చేసిన ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా అన్ని షేడ్స్ ని పర్ఫెక్ట్ గా చేసాడు.స్పోర్ట్స్ మినిస్టర్ గా బ్రహ్మానందం నవ్వించడానికి ట్రై చేసాడు కానీ నవ్వించలేకపోయాడు. వీరు కాకుండా సాయాజీ షిండే, నాగినీడు, సుబ్బరాజులు తమ నటనతో సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. ప్రభాస్ శ్రీను ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా బాగానే నవ్వించారు.మంచు మనోజ్ – ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే కోర్టు సీన్ మరియు అక్కడ చెప్పే పులి కథ బాగుంది.

లవ్ స్టొరీ విత్ థ్రిల్లర్ అనేది మన తెలుగు వారికి కాస్త కొత్తదైన జానర్.. ఈ జానర్ ని డీల్ చేయడం అంత ఆశా మాషీ కాదు. కానీ దశరథ్ ట్రై చేసారు, కానీ సక్సెస్ కాలేకపోయారు అనే చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాకి కెప్టెన్ అయిన దశరథ్ ఎందుకున్న స్టొరీ లైన్ బాగుంది, కానీ డెవలప్ చేసుకున్న కథ బాలేదు.కిషోర్ గోపు రాసిన స్క్రీన్ ప్లే అయితే మరీ బోరింగ్ అండ్ స్లో గా నత్త నడకలా ఉంది.మల్హర్ భట్ జోషి అందించిన విజువల్స్ సినిమాకి తగ్గట్టుగానే డీసెంట్ గా ఉన్నాయి. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కె. వేదకి మొదటి సినిమా అయినా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నేపధ్య సంగీతంతో సినిమాకి కాసింత హెల్ప్ చేసాడు. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ మొదటినుండి సినిమా మాత్రం చాలా బోరింగ్ గా ఎడిట్ చేసారు.సినిమా ఎండ్ లో బాగుంది.

ప్లస్ పాయింట్స్:

  • క్లైమాక్స్
  • మంచు మనోజ్ యాక్టింగ్
  • దర్శకత్వం

మైనస్ పాయింట్స్ :

  • మ్యూజిక్
  • ప్రొడక్షన్ వాల్యూస్
  • కామెడీ

అలజడి రేటింగ్: 2.5/5.

                                                          పంచ్ లైన్:  ట్విస్ట్ లతో కన్ప్యూజ్ చేసిన ‘శౌర్య’.

(Visited 998 times, 1 visits today)