Home / Entertainment / కొంచెం డిఫరెంట్…కొంచెం రొటీన్ – మనోజ్ ‘శౌర్య’ టీజర్

కొంచెం డిఫరెంట్…కొంచెం రొటీన్ – మనోజ్ ‘శౌర్య’ టీజర్

Author:

అందమైన కుటుంబబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో చక్కటి సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దశరథ్, డిఫరెంట్ సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్‌‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘శౌర్య’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రెజీన కసాండ్ర హీరోయిన్ గా కనిపించింది. గతంలో దశరథ్,మనోజ్‌‌ ఇద్దరు “శ్రీ” అనే సినిమా చేసారు. ఈ సినిమాతోనే మనోజ్ హీరోగా, మిల్కీ బ్యూటి తమన్న హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు పరిచాయం కావడం విశేషం. గతంలో ‘భద్రాద్రి’, ‘ఆకాశంలో సగం’, ‘సూర్య వ్స్ సూర్య’ వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ ఎం.శివకుమార్,సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.

తాజాగా విడుదలైన చిత్ర ఈ టీజర్ ఇక ఇప్పటి వరకు కనిపించని విధంగా మంచు మనోజ్ ఈ చిత్రంలో ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తు అంచనాలను పెంచుతుంది. ఈ చిత్రానికి దశరథ్ సోదరుడు వేద సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక జనవరి 31న హైదరాబాద్ లోని శిల్పకళ వేదికలో ‘శౌర్య’ ఆడియోని విడుదల చేయడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

(Visited 140 times, 1 visits today)