Home / Entertainment / ఇప్పుడు సిద్ధార్థ్‌ చెన్నైవాసుల రియల్ హీరో.

ఇప్పుడు సిద్ధార్థ్‌ చెన్నైవాసుల రియల్ హీరో.

Author:

Hero Siddarth helping in chennai

డబ్బులివ్వటం కాదు తన ప్రజలకి ధైర్యాన్నిచ్చేవాడే రియల్ హీరో. మన సినిమా హీరోలు కొన్ని సార్లు నిజ జీవితం లోనూ హీరోల్లాగే ఉంటారు. జాతీయ విపత్తుల సమయల్లో ఎన్నోసార్లు సినీ పరిశ్రమ నుంచి సహాయం,సహకారం అందుతూనే ఉంది. తమని హీరోలని చేసిన అభిమానులని సినీ హీరోలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇప్పుడు కూడా సినిమా రంగం తనవంతుగా సహాయం అందించటం కోసం ముందుకు వచ్చింది సినీ ప్రముఖులూ,హీరోలూ తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించేసారు. ఐతే ప్రత్యక్షంగా తన వారి కోసం సేవ చేస్తూ ఒక రియల్ హీరో చెన్నై లో తిరుగుతున్నాడిప్పుడు అతను సిద్దార్థ్. ఆహారాన్ని తయారు చేయించి.. వాహనాల్లో వరద బాధితులకు అందిస్తున్నాడు. అందుకు ట్విట్టర్లో ఇతరుల సహాయాన్ని కూడా కోరుతున్నాడు. ఆహారం, ఇతర పదార్ధారాలు కావాలనుకునే వాళ్లు ఫోన్‌ చేయాలంటూ కొన్ని నెంబర్లను కూడా సిద్ధార్ధ ట్విట్టర్లో పోస్ట్‌ చేశాడు.

గుక్కెడు నీళ్ల కోసం అగచాట్లు పడటం మాత్రమే తెలిసిన చెన్నై మహా నగరం ఇప్పుడు వరద నీటిలో మునిగి పోయింది. విమానాశ్రయం సైతం పెద్ద చెరువులా మారింది. జూపార్క్ లోని 40 మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోవడం, అనేకచోట్ల విష సర్పాల జాడ కనబడటం జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఆహారం దొరక్క, పరిశుభ్రమైన నీరు లభించక, నిత్యావసరాల జాడే లేక నగర పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. వందల ఇళ్లు ధ్వంసంకాగా, వేలాది ఇళ్లు, భవంతులు వరదనీటిలో మునిగి ఉన్నాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ల సదుపాయం నిలిచిపోవడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఫోన్లు పనిచేయటం లేదు, విద్యుత్ సరఫరా లేదు, నిత్యావసరాలు లేవు, తాగటానికి మంచినీరు లేదు. ఇంతటి భయానక స్థితిలో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో ఇంట్లో మరుగుదొడ్డిని కూడా వినియోగించుకోలేని దుస్థితి. చెన్నై వాసులు నరకం అనుభవిస్తున్నారు. కనీసం సహాయ బృందాలు కదలడానికీ అనువుగా లేని బీభత్సంతో చెన్నై వణికిపోతోంది. ఈ క్రమంలో చెన్నైలో వున్న హీరో సిద్దార్ధ్ అక్కడి పరిస్థితిని వివరించారు. అంతేకాక తన ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండంటూ… కొన్ని ఫోటోలను కూడా ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు. తన ఇంటి పరిస్థితిని అందులో చూపించాడు. ఇంట్లో ఉండే పరిస్థితి లేక మేమంతా టెర్రస్ పైకి వెళ్తున్నామని ట్వీట్ చేసిన కొన్ని గంటల లోనే తనవంతుగా తన నగర ప్రజలని ఆదుకునే పనిలో మునుగిపోయాడు. ఈ నేపథ్యంలో తనవంతు సాయం చేద్దామని సిద్ధార్థ్ రంగంలోకి దిగారు. ఆహార ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లను సోషల్ సైట్ ద్వారా అడుగుతూ వాటిని బాధితులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. తన స్నేహితు ను జతపరిచి ఒక టీమ్‌ తయారు చేశాడు. వారి సహయం తో వరదల్లో చిక్కుకున్న వారికి వాటర్‌ ప్యాకెట్లు మరియు ఫుడ్‌ ప్యాకెట్ల ను వీధివీధి న తిరుగుతూ పంచి పెడుతున్నాడు.అలాగా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుబడుతున్నాడు. మరో ప్రక్క పరోక్షంగా ,తన ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ తో సిద్ధార్థ్‌ కొన్ని కార్పొరేట్‌ సంస్థలను కూడా కలుపుకుని చెన్నై ప్రజలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు సిద్ధార్థ్‌ చెన్నై వాసుల కు రియల్ హీరో గా కనిపిస్తున్నాడు.

(Visited 89 times, 1 visits today)