Home / health / రోజు 7 గంటలైనా నిద్రపోకపోతే ఏడు అనారోగ్యాలు కలుగుతాయట!

రోజు 7 గంటలైనా నిద్రపోకపోతే ఏడు అనారోగ్యాలు కలుగుతాయట!

Author:

టెక్నాలజీ పెరగడం వలన పని ఎంత వేగవంతం అయిందో దాని వలన కలిగే హాని కూడా అంతే వేగం అయింది. ముఖ్యంగా యువత, సాఫ్ట్ వేర్ జాబర్స్ సోషల్ మీడియాకు అలవాటుపడి సరైన నిద్రకు దూరమవుతూ ఆనారోగ్యంపాలు అవుతున్నారు. చాలా మంది ఎక్కువగా చాట్ చేస్తూ, లేదా సినిమాలు చూస్తూ టైం తెలియకుండా రాత్రి నిద్రపోకుండా గడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువగా పెరుగుతుంది.

రాత్రి ఎప్పుడో నిద్రపోయి ఉదయానే లేచి స్టూడెంట్స్ అయితే హడావిడిగా కాలేజ్ కి పోవడం ఉద్యోగులు అయితే ఆఫీస్ కి రెడీ అయి పోతుంటారు. ఇలాంటి వారికి రానున్న రోజుల్లో చాలా ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. యువత కానీసం 7-9 గంటలు, టీనేజర్స్ 8-10 గంటలు, చిన్న పిల్లలు అయితే 11-14 గంటలు నిద్రపోవాలి అని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా యువత నిద్రకు దూరం అవ్వడం వలన ప్రధానంగా ఏడూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అని తెలిసింది.

side-effects-of-lack-of-sleeping

మతిమరుపు: శరీరానికి సరిపడినంత నిద్ర లేకపోవడంవలన మెదడు ఆలోచించే శక్తిని క్రమంగా కోల్పోయి దాని వలన మతిమరుపు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.

చర్మ సంబంధ సమస్యలు: ఏడూ గంటల కంటే తక్కువ నిద్రపోవడం వలన చర్మ సంబంధ సమస్యలు వేదిస్తాయి అందులో ఎక్కువగా చర్మంపై ముడుతలు, కళ్ల కింద మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయని సర్వేలో తెలిసింది.

అధిక బరువు : ఒక్కరోజు నిద్రకు దూరమవడం వలన మరుసటి రోజు విపరీతంగా ఆకలి పెరిగి అతిగా తింటున్నారు. దీనితో మీకు తెలియయకుండానే అధిక బరువు పెరిగి ఆయాసంతో బాధపడుతున్నారు.

సంతాన సమస్యలు: ఏడు గంటలకంటే తక్కువగా నిద్రపోవడం వలన వ్యక్తిగతంగానే కాదు వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదురుకానున్నాయి. 2002 లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ, మెటాబాలిజమ్ లో ప్రచురితమైన కథనం తెలిపిన వివరాల ప్రకారం తక్కువగా నిద్రపోయే మగవారిలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోయి దాని ప్రభావం శృగారంలో అలాగే సంతానంలో ఉంటుంది.

రక్తపోటు : ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారికి రక్తపోటు పెరిగి గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా ఇలాంటి వారికే వస్తున్నట్టు సర్వేలో తేలిన నిజం.

రోగనిరోధక శక్తి తగ్గుదల : నిద్రలేమి సమస్య వలన మామూలు జలుబు చేసిన తట్టుకోలేని విధంగా తయారవుతారని తెలిసింది. మన శరీరంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గడంవలన ఆరోగ్యసమస్యలు పెరగడం మొదలవుతాయి.

మానసిక ఒత్తిడి: కంటి నిండా నిద్రలేకపోవడం వలన అనేక మానసిక సమస్యలు వస్తాయని, ఈ మానసిక శక్తి ఆలోచన శక్తిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని సర్వ్ వెల్లడించింది.

(Visited 6,313 times, 1 visits today)