Home / Entertainment / శ్రీమంతుడు, బాహుబలి సినిమాలకి అవార్డుల పంట..!

శ్రీమంతుడు, బాహుబలి సినిమాలకి అవార్డుల పంట..!

Author:

SIIMA-2016-awards-Winners-list

సినిమా ఫంక్షన్స్ అంటే ఒక్కప్పుడు నార్త్ లోనే అద్భుతంగా జరుగుతాయి అని పేరు ఉండేది ఇన్ని రోజుల కానీ ఈ మధ్య సౌత్ లో కూడా చాలా బాగా జరుగటానికి కారణం సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్). 2012లో మొదలైన ఈ అవార్డు ఫంక్షన్ ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం సైమా అవార్డ్స్ కూడా చాలా అత్యద్భుతంగా జరిగాయి.

నిన్న జరిగిన సైమా అవార్డ్స్ లో తెలుగు కన్నడ అవార్డ్స్ ప్రకటించారు. ఈ సంవత్సరం సైమా అవార్డ్స్ అన్ని శ్రీమంతుడు, బాహుబలి సినిమాలకే వచ్చాయి. ఇందులో శ్రీమంతుడు సినిమాలో హీరోగా నటించిన మాహేష్ బాబు కి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఈ అవార్డు తో సైమా అవార్డ్స్ ఇప్పటి వరకు 5 సార్లు జరిగితే మూడు సార్లు మాహేష్ బాబు కి రావడం విశేషం. ఇక బాహుబాలి సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి కి ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది.

ఉత్తమ చిత్రం- బాహుబలి
ఉత్తమ నటుడు- మహేష్ బాబు(శ్రీమంతుడు)
ఉత్తమ నటి- శృతి హాసన్(శ్రీమంతుడు)
ఉత్తమ దర్శకుడు- రాజమౌళి(బాహుబలి)
ఉత్తమ నటుడు (క్రిటిక్)- అల్లు అర్జున్(రుద్రమదేవి)
ఉత్తమ నటి(క్రిటిక్)- అనుష్క(రుద్రమదేవి)
యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా- సమంత
ఉత్తమ సహాయ నటుడు- రాజేంద్ర ప్రసాద్(శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటి- రమ్యకృష్ణ(బాహుబలి)
ఉత్తమ విలన్- దగ్గుబాటి రానా(బాహుబలి)
ఉత్తమ కమెడియన్- వెన్నెల కిషోర్(భలేభలే మగాడివోయ్)
జీవిత సాఫల్య పురస్కారం- ఎస్ జానకి
ఉత్తమ నూతన నటుడు- అక్కినేని అఖిల్(అఖిల్)
ఉత్తమ నూతన నటి- ప్రగ్యా జైస్వాల్(కంచె)
ఉత్తమ నూతన నిర్మాత- విజయ్ రెడ్డి మరియు శశిదేవ్ రెడ్డి(భలే మంచి రోజు)
ఉత్తమ నూతన దర్శకుడు- అనిల్ రావిపూడి(పటాస్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్- రామ రామ (శ్రీమంతుడు)
ఉత్తమ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్(శ్రీమంతుడు)
ఉత్తమ కొరియోగ్రాఫర్- జానీ(టెంపర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్- సెంథిల్ కుమార్(బాహుబలి)
ఉత్తమ గేయ రచయిత- సిరివెన్నెల సీతారామ శాస్త్రి(కంచె)
ఉత్తమ గాయకుడు- సాగర్ (జత కలిసే- శ్రీమంతుడు)
ఉత్తమ గాయని- సత్య యామిని(మమతల తల్లి- బాహుబలి)

(Visited 152 times, 1 visits today)