Home / Inspiring Stories / విషాన్ని వీడి భారతదేశ ఆదర్శ రాష్ట్రం అయిన సిక్కిం.

విషాన్ని వీడి భారతదేశ ఆదర్శ రాష్ట్రం అయిన సిక్కిం.

Author:

ప్రతీదీ కల్తీమయమైన ఈ కాలంలో ఏదీ స్వచ్చమైంది లేదు మనుషులతో సహా ప్రతీ ఒక్కటీ విషమయమైపోతోంది ఆఖరుకు తినే తిండి కూడా విషాన్ని నింపుకుంది. కూరగాయలూ,అన్నం కూడా భయంకర రసాయణాల భూయిష్టమైపోయే పరిస్థితి దాపరించింది మన దేశం లో దేశంలో పెరుగుతున్న జనాభాకు ఆహరం కొరత పెను సంక్షోభమైన సమయంలో హరిత విప్లవం అనివార్యమైంది. ఆ సమయంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉత్పత్తిని పెంచటానికి ఆసరాగా నిలిచాయి. ఆహారోత్పత్తి గణనీయంగా పెరగడంలో రసాయన ఎరువులూ తప్పనిసరయ్యాయి . 60 ల్లో వచ్చిన హరిత విప్లవంలో రసాయన ఎరువులదే ముఖ్యపాత్ర. నీటి వనరులు తగ్గుతూంటే కొత్త వంగడాలూ పెరిగాయి.ఇప్పుడు కొత్తగా హైబ్రిడ్ విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి… పంటల్లోనే కాకుండా పండ్లు, కూరగాయల సాగులో కూడా పురుగు మందులు, రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటో్ంది. వీటిని పంటలపై స్ప్రే చేస్తున్నసమయంలో పర్యావరణానికి హాని కల్గుతోంది. భూమి, జలవనరులు వీటి విష ప్రభావానికి లోనవుతున్నాయి. పర్యావరణానికి అవసరమైన, హాని చేయని ఎన్నో క్రమి కీటకాలు, మొక్కలు దీని మూలంగా నాశనం అవుతున్నాయి. అపురూపమైన జలచరాలు, ఆకాశంలోని పక్షి జాతులు కూడా దెబ్బతింటున్నాయి. వీటి కారణంగా భూసారం కూడా క్రమంగా క్షీణిస్తోంది..మానవ అవసరాలకోసం మొదలైన పద్దతి ఇప్పుడు మానవాళి మనుగడనే సవాల్ చేసేంతగా ఎదిగింది.

Sikkim Organic

వీటికి తోడు ఎరువులు, పురుగు మందులు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందులు వాడిన పండ్లు, కూరగాయలను విదేశాలు తిరస్కరిస్తున్నాయి.ఇక్కడ తినాలన్నా వాటి దుష్ప్రభావాలు ధీర్గ కాలం లో మనిషి మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశమూ ఉంది.ఈ కారణాల నేపథ్యంలోనే సేంద్రియ ఎరువులతో పండించే ఆర్గానిక్ పంటల అవసరం మొదలైంది. ఐతే ఇదీ సరైన స్థాయిలో జరగటం లేదు అయితే చిన్న రాష్ట్రం అయిన సిక్కిం ఈ బాటలో ఒక ముందడుగు వేసింది.ఎరువులను, పురుగు మందులను నిషేధించి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఇవేవీ లేకుండానే ఆహారోత్పత్తి అదే స్థాయిలో సాధించవచ్చని చాటి చెప్పింది. చిన్న రాష్ట్రమైనా సిక్కిం చూపిన బాట తక్కువేం కాదు. ఈ రాష్ట్రం వ్యవసాయం రంగంలో నెలకొల్పిన ప్రమాణాలను మేధావులు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Sikkim

దేశంలోకెల్లా పూర్తిస్థాయి సేంద్రీయ వ్యవసాయ పద్దతులు అమలు చేసే రాష్ట్రంగా సిక్కిం ఆవిర్భవించింది. దాదాపు 75వేల హెక్టార్ల వ్యవసాయ భూమిలో రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ పద్దతులు అవలంబించడం ద్వారా సాగు చేస్తూ ఈ ఘనత సాధించింది. డిసెంబరు చివరి నాటికి పూర్తి స్థాయి సేంద్రీయ హోదా సాధించామని సిక్కిం ఆర్గానిక్‌ మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా||అంబళ్‌గన్‌ పిటిఐకి తెలిపారు. ఈ నెల 18న గ్యాంగ్‌టక్‌లో జరిగే వ్యవసాయ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటిస్తారు. 75వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని క్రమంగా సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ భూమిగా మార్చినట్లు చెప్పారు. జాతీయ సేంద్రీయ ఉత్పత్తి కార్యక్రమంలో విధించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం సేంద్రీయ పద్దతులను, సిద్ధాంతాలను అమలు చేయడం ద్వారా ఇది సాధించామని చెప్పారు. 12ఏళ్ళ క్రితం అంటే 2003లో పవన్‌ చామ్లింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సిక్కింను సేంద్రీయ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అనుకుంది. ఆ మేరకు అసెంబ్లీలో ప్రకటించింది. ఆ తర్వాత రసాయనాలతో కూడిన ఎరువుల ప్రవేశాన్ని నిషేధించింది. వాటి అమ్మకాలను నిషేధించింది. దాంతో రైతులు సేంద్రీయ వ్యవసాయానికి మళ్ళడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోయింది.

organic-food-of-biotech

చైనా తర్వాత ప్రపంచంలో ఎక్కువగా పంటల మీద రసాయనిక ఎరువులు వాడుతున్న దేశం మనదే. ఇక్కడ ఎరువుల ఉత్పత్తి చాలక ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇందుకోసం వేల కోట్ల రూపాయిల విలువైన విదేశీ మారకాన్ని వెచ్చిస్తున్నాం.విషాహారాన్ని తయారు చేసుకొని గరళాన్ని తింటున్నాం,ఇప్పుడు ఈశాన్య రాష్ట్రం సిక్కింబాట అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయం అవుతుంది. ఇప్పుడందరూ సిక్కిం చూపిన దారిపై దృష్టిసారించాల్సి ఉంది.

Sikkim1

జనాభాలో మన దేశం చైనాతో పోటీపడుతోంది. అలాగే ఎరువుల వినియోగంలోనూ ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉంటే ఇండియా తర్వాత స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సిక్కిం చూపిస్తున్న ప్రత్యామ్నాయ మార్గం అందరికీ ఆదర్శప్రాయం అవుతోంది.ఈ చిట్టి రాష్ట్రం సాగించే పోరాట ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని కూడా ఆకర్షించాయి. వ్యవసాయంలో నూతన పోకడలు ఆవిష్కరించిన సిక్కిం దేశానికే గర్వకారణంగా నిలిచిందంటూ మోదీ కితాబిచ్చారు. మిగిలిన రాష్ట్రాలనూ అదే బాటలో నడవమంటూ సూచించారు.ఈ మధ్య ఒక టీవీ కార్యక్రమంలో ప్రముఖ హిందీ నటుడు అమీర్ ఖాన్ సిక్కిం అనుసరిస్తున్న మార్గాన్ని ప్రప్తావించారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు జరగడానికి ప్రోత్సాహం అవసరం అన్నారు. 2012-13 సంవత్సరంలో ఎరువులపై సబ్సిడీల బిల్లు దాదాపు రూ.70 వేల కోట్లుగా ఉంది. ఇంత పెద్ద మొత్తాలను సేంద్రీయ ఎరువుల తయారీ కోసం, దీనిపై రైతుల్లో అవగాహన పెంచడంకోసం ఉపయోగించవచ్చు.

Sikkim (1)

సరైన గాలి కూడా పొందలేని మనం ఆరోగ్యం కోసం తాజాపండ్లు, కూరగాయలు ముఖ్యమని వాటినే కోరుకుంటున్నాం.వాటి మీదే ఆధార పడుతున్నాం పండ్లు, ఆకు కూరలపై ఎంత కడిగినా వదలకుండా ఉంటున్న ఎరువులు, పురుగుమందుల అవశేషాల మాటేమిటి? ఇవి తింటే వచ్చేది ఆరోగక్యమా, అనారోగ్యమా? ప్రతీ పండు నీ ప్రతీ కూరగాయనీ కల్తీ చేస్తున్నారు,రసాయణాలతో నింపేస్తున్నారు… ఈ పరిస్థితుల్లో మన దృష్టి సేంద్రియ ఎర్వులమీదా,ఆర్గానిక్ పంటలమీదా ఉండాల్సిందే లేదంటే రేపటి రోజున ఆహారం తిని ఆ దుష్ప్రభావాన్ని తట్టుకునేందుకు విరుగుడు మందులను వాడాల్సి వస్తుందేమో…

(Visited 845 times, 1 visits today)