Home / health / మీ పిల్లల చర్మం రంగు మెరుగుపడాలంటే ఈ పద్దతిని పాటించండి.

మీ పిల్లల చర్మం రంగు మెరుగుపడాలంటే ఈ పద్దతిని పాటించండి.

Author:

అందం అంటే ఈ ప్రపంచంలో చిన్నపిల్లలదే. ఎందుకంటే వారి కలర్ ఎలా ఉన్నా ముద్దుగా ఉంటారు. వారు పెరిగే కొద్దీ వారి తల్లిదండ్రుల కలర్ లోకి మారుతుంటారు. కొందరు చిన్నపిల్లలు పుట్టిన కొన్ని రోజులకే వారి తల్లిదండ్రుల కలర్ లోకి మారుతుంటారు. ఆ తల్లిదండ్రులు ఇప్పుడే పిల్లలు ఇలా కలర్ తక్కువగా ఉంటే పెరిగిన తరువాత ఎలా ఉంటాడో అని ఆందోళన చెందుతుంటారు. అందుకే చిన్నపిల్లల కోసం మార్కెట్ లో రకరకాల సబ్బులు, క్రీములు, పౌడర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వలన పిల్లల అందం పెరుగుతుందో లేదో తెలియదు కానీ అందులోని కెమికల్స్ వలన పిల్లల లేత చర్మం చెడిపోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంది. మన పూర్వికులు వాడిన సులువైన పద్దతి వాడి మన పిల్లల ఆరోగ్యంతోపాటు అందాన్ని పెంచుకోవచ్చు. ఆ పద్దతి గురించి క్రింద తెలుసుకోండి.

simple tip to change child body color

పిల్లల చర్మ రంగును మెరుగుపరిచే మిశ్రమం తయారి విధానం.

కావలసిన పదార్థాలు : పెసర పిండి, పసుపు, పాలమీగడ.

ఒక చిన్న పాత్రలో ఒక చెంచాడు పెసరపిండి, చిటికెడు పసుపు, తగిననత పాలమీగడను తీసుకోని బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని పిల్లలకు స్నానం చేయించే ముందు సున్నిపిండిలా రుద్ది స్నానం చేయిస్తే సరిపోతుంది. ఈ విధానంలో ఎలాంటి రసాయనాలు కలవవు దానితో పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ విధానంతో ఖచ్చితంగా పిల్లల రంగు మెరుగుపడే అవకాశం ఉంది. ఈ విధానం వలన మన పిల్లలకు మనమే కొత్త రంగు కలిగించామనే సంతృప్తి కలుగుతుంది. ఒక్కసారి మీరు చేసి చూడండి దాని ఫలితం మీకే అర్ధం అవుతుంది.

source: https://touchlountechepta.in/pillala-kossam-ela/

(Visited 8,545 times, 1 visits today)