Home / health / బ్రెడ్‌తో పచ్చగా ఉన్న పళ్లను తెల్లగా చేసుకోండి.

బ్రెడ్‌తో పచ్చగా ఉన్న పళ్లను తెల్లగా చేసుకోండి.

Author:

మనం ఇతరులతో మాట్లాడే సమయంలో మన ప్రవర్తన, డ్రెస్సింగ్ ఎంత ముఖ్యమో మన నోటి నుండి వాసన రాకుండా, పళ్ళు తెల్లగా ఉండేలా చూసుకోవటం కూడా అంతే ముఖ్యం. చాలా మంది పళ్ళు ఎంత తోమినా పసుపు పచ్చగానే ఉంటాయి. కొందరి పళ్ళు మాత్రం మామూలుగానే తెల్లగా ఉంటాయి. పసుపు పచ్చ పళ్ళు ఉన్నవారు తెల్లదనం కోసం డెంటల్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి శుభ్రం చేయించుకుంటుంటారు. అలా ఎక్కువగా చేయించుకుంటే పళ్ళు పాడైపోతాయి. సిగరెట్, గుట్కా, పాన్, బీడీ అలవాటు ఉన్నవారి పళ్ళు కూడ పసుపు పచ్చగా మారి ఎంతకూ తెల్లగా మారవు. కాని ఒక బ్రెడ్‌ ముక్కతో మీ పచ్చ పళ్ళను తెల్లగా మార్చుకొవచ్చని తెలుసా? తెలియకుంటె ఆ విదానన్ని క్రింద చదవండి.

simple-tip-to-whiten-teeth-with-bread

కొద్దిగా మందంగా ఉండే బ్రెడ్‌ని తీసుకోని మంట పై కాల్చాలి. ఈ బ్రెడ్‌ ఒక సగం కొద్దిగా బ్రౌన్ కలర్ మారే వరకు, ఇంకో సగం బ్లాక్ కలర్ మారే వరకు కాల్చాలి. కలర్ మారే వరకు కాల్చిన బ్రెడ్‌ ను తుంచి రెండు భాగాలుగా చేసి బ్రెడ్‌ లోని నలుపు భాగముతో ఒకసారి, తెలుపు భాగంతో ఒకసారి మార్చి, మార్చి ఒక 3 -4 నిమిషాలు పళ్ళు తోమాలి. ఇలా తోమిన తర్వాత వెంటనే పళ్ళను శుభ్రం చెయ్యకుండా ఒక 6-7 నిమిషాల తర్వాత పళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక అరగంట వరకు ఎలాంటి ఆహరం తీసుకోకూడదు. పైన చెప్పిన పద్దతిని పలుమార్లు పాటిస్తే మీ పచ్చ పళ్ళు త్వరలో తెల్లగా మారుతాయి.

Must Read: శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని,విష పదార్థాలని 3రోజులలో తగ్గించుకోవచ్చు..!

(Visited 8,938 times, 1 visits today)