Home / health / మొటిమలు తగ్గాలంటే ఇలా చేయండి.. చాలా సింపుల్.

మొటిమలు తగ్గాలంటే ఇలా చేయండి.. చాలా సింపుల్.

Author:

వయసులో ఉన్న వారిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ముఖంపై వచ్చే మొటిమలు ఒకటి.ఇవి కౌమార దశలోకి అడుగుపెట్టిన వయస్సు వారి నుండి పెద్దవారి వరకు వస్తుంటాయి. ముఖం ఎంత అందంగా ఉన్నా, మొటిమలు వచ్చాయంటే అసహ్యంగా కనిపిస్తారు. ఈ మొటిమలు కొన్ని సార్లు పుండ్లుగా మారి మ‌రింత ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే వాటిని తగ్గించుకునేందుకు గాను వివిధ ఆయింట్ మెంట్స్ వాడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొటిమలు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. పైగా, అవి ఖర్చుతో కూడుకున్నవి. మొటిమలతో బాధపడే వారికి ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఈ సుల‌భ‌మైన చిట్కాలు పాటిస్తే మొటిమలు మటుమాయం అవుతాయి అంటున్నారు నిపుణులు.

simple tips-for-pimples-removing-660x330

మొదటి చిట్కా: ఒక పాత్రలో కొద్దిగా శెనగపిండి తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పేస్ట్‌లా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే.. మొటిమలు తగ్గుతాయి.

రెండవ చిట్కా: ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిరసం వేసి.. అనంతరం దాంట్లో కొంచెం తేనే కలుపుకుని ఈ మిశ్రమాన్ని మొటిమలు, వాటి మచ్చలపై రాసి.. కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. గంటసేపు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది.

మూడవ చిట్కా: గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Must Read: రాత్రి పడుకునే ముందు ఈ టిప్స్ పాటిస్తే తెల్లారే సరికి ముఖం అందంగా అవుతుంది.

(Visited 2,244 times, 1 visits today)