Home / health / జలుబు తగ్గడానికి వంటింటి చిట్కాలు…

జలుబు తగ్గడానికి వంటింటి చిట్కాలు…

Author:

వాతావరణం మారగానే వచ్చిపడే ఆరోగ్య సమస్యల్లో జలుబు ముందుంటుంది. జలుబు పెద్ద అనారోగ్యం కాకపోయినా ఉన్నన్ని రోజులు తెగ చికాకు పెడుతుంది. జలుబు తగ్గడానికీ కొందరు మాత్రలు వాడితే, మరికొందరు దానంతట అదే పోతుంది లే అని వదిలేస్తారు. మరిప్పుడు వర్షాకాలం వచ్చింది దానితో పాటు చాలా మందికి జలుబు కూడా చేసుంటుంది. మన వంటింట్లో దొరికే సామన్లతోనే జలుబు నుండి ఎలా ఉపశమనం పొందాలో చదువండి.

simple-tips-to-get-relief-from-cold

  • వేడి నీటిలో పసుపు వేసి ఆ నీరును ఆవిరి పట్టిస్తే జలుబు నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. అలా కాకుండా నిప్పులలో పసుపుకొమ్ము వేసి ఆ పొగను ఆవిరి పట్టిన అదే ఫలితం ఉంటుంది.
  • తేనెతో మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి తిన్నట్లయితే జలుబు తగ్గుతుంది.
  • పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలొ చిటికెడు జీలకర్ర పొడీ, టీస్పూన్ తేనె, టీస్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా 2-3 రోజుల పాటు చేస్తె జలుబుతో వచ్చిన గొంతునొప్పి తగ్గుతుంది.
  • తులసి లేద అల్లం రసాన్ని తేనేతో కలిపి త్రాగితే తొందరగా జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.

ఇలా మనకు అందుబాటులో వున్న పదార్ధాలతో వంటింటి చిట్కాలు పాటిస్తు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Must Read: రాత్రిపూట చపాతిలు తినడం వల్ల కలిగే లాభాలు.

(Visited 4,925 times, 1 visits today)