Home / General / బ్రేకింగ్‌: డిసెంబర్‌ 7న తెలంగాణలో పోలింగ్‌!

బ్రేకింగ్‌: డిసెంబర్‌ 7న తెలంగాణలో పోలింగ్‌!

Author:

తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణలో పోలింగ్‌ తేదీ వెల్లడించినప్పటికీ.. ఎన్నికల షెడ్యూల్‌పై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాలకు ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నదని, తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్లే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

 

Single phase polls in Telangana on Dec 7

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ఈ విధంగా ఉంది..

నవంబర్ 12న నోటిఫికేషన్‌ వెలువడనుంది..

నామినేషన్లు దాఖలు చివరి తేదీ : నవంబర్ 19

నామినేషన్ల పరిశీలన : నవంబర్ 20

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : నవంబర్ 22

పోలింగ్: డిసెంబర్ 7

కౌంటింగ్: డిసెంబర్ 11

ఓ కేసులో పెండింగ్‌లో ఉంది..

డిసెంబర్‌ 15నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని వెల్లడించారు. మిజోరాంలో అభ్యర్థుల ప్రచార ఖర్చు రూ.20లక్షలు , మిగతా మూడు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును రూ.28లక్షలు మించకూడదని నిబంధన విధించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని ఈ ఎన్నికల్లో అమలులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతి పోలింగ్‌కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు.

(Visited 1 times, 1 visits today)