Home / Inspiring Stories / ఒకప్పుడు సామన్య ఒక ఆడపిల్ల నేడు గొప్ప ధనవంతురాలు

ఒకప్పుడు సామన్య ఒక ఆడపిల్ల నేడు గొప్ప ధనవంతురాలు

Author:

padmasri kalpana

మనిషి విజయం సాధించాలంటే సంకల్పం, పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని,. పేద కుటుంబంలో పుట్టినా, అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగేసి ఉన్నత స్థానానికి చేరుకుంది కల్పన సరోజ్.కల్పన ఒక పేద దళిత కుటుంబంలో పుట్టింది. తను పాఠశాలకి వెళ్ళే రోజుల్లో  స్నేహితులతో వారి ఇంటికి వెళ్ళితే వారు ఇంట్లోకి రానిచ్చేవారు కాదు, అలాగే పాఠశాలలో ఆటా,పాటల మరియు సాంస్కృతిక విభాగలలో కూడా పాలుపంచుకునిచ్చేవారు కాదు. దానికి తోడు 12 సంవత్సరాలకే 10 సంవత్సరాలు ఉన్న అబ్బాయితో పెళ్ళి చేసి అత్తారింటికి పంపించారు వారి తల్లిదండ్రులు.

                    అక్కడకు వెళ్ళాక తెలిసింది కల్పనకు వారు ఉండేది ఒక మురికివాడలో అని, దానికి తోడు తన భర్త యొక్క పెద్ద అన్నయ్య తన భార్య ఇద్దరు కలసి కల్పనను అన్ని పనులు చేయించేవారు. చిన్నపిల్ల అని కూడా చూడకుండ తనని హించేవారు. ఒక రోజు అనుకోకుండా కల్పన తండ్రి వచ్చి చూసేసరికి తన కూతురేనా అనే అనుమానంవచ్చింది. చిరిగిన బట్టలతో, చిన్నపిల్ల అని చూడకుండ ఇన్ని కష్టాలు పెడుతారా! అని కల్పనను అక్కడి నుండి తీసుకొని తన ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఆ రోజులలో పెళ్ళి అయిన వారిని అత్తావారి ఇంటి నుండి తీసుకొస్తే చిన్న చూపు చూసిన పర్వలేదు కానీ, తన ఇంట్లో ఎవ్వరు పట్టించుకోలేదు చివరికి తనను ఒక విసిరివేసిన విస్తరిలా చూసేవారు.

కల్పనకు అప్పుడే అర్ధం అయింది ఎన్ని రోజులు బ్రతికి ఉన్నా, మనకంటూ ఒక పని తెలిసుండాలి లేకుంటే పక్కవారు అయిన ఇంటివారు అయిన చిన్న చూపే చూస్తారు అని. కల్పన తన 16వ యేట వారి మామయ్య దగ్గరికి వచ్చి మెల్లగా టైలరింగ్ నేర్చుకోవడం మొదలెట్టింది. కొద్దిరోజుల్లోనే తన సంపాధన రోజుకు 30రూపాయలు వచ్చేవి. కానీ కొన్ని రోజుల తర్వాత కాలితో తొక్కే మిషన్స్ కాకుండ పారిశ్రామిక కుట్టు మిషన్ల పై పని చేస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చు, అని ప్రభుత్వానికి లోను కావలని అప్లై చేయాగానే తనకు లోన్ రావడంతో పారిశ్రమిక కుట్టు మిషన్స్ తో పని చేయాడం వలన తక్కువ రోజుల్లోనే అనుకున్న లక్ష్యాలను సాదించింది. ఆ తర్వాత మంచి పేరున్న మెతల్ కంపెనీని భారి రేటుకు కొన్నది, కమని ట్యూబ్స్ తో తొలి సారిగా ఒక పెద్ద బిజినెస్ ప్రారంభం చేయాడంతోనే ఫ్యాక్టరిని మోడలైజేషన్ చేసింది. ఇక కల్పన జాతకం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు కల్పన టర్నోవర్ $100m .
చివరకు కల్పనకు  శ్రమకు తగిన ఫలితం దక్కింది 2013 లో పారిశ్రామిక వర్గంలో పద్మశ్రీ  వరించింది.

(Visited 1,305 times, 1 visits today)