Home / Inspiring Stories / మీ స్మార్ట్ ఫోన్ మీ మెదడుని తినేస్తోంది.

మీ స్మార్ట్ ఫోన్ మీ మెదడుని తినేస్తోంది.

Author:

Night Usage

స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక నిద్రపోవటం తగ్గింది… మనుషుల్లో అనారోగ్యాలూ పెరిగాయి.. ఒక్క రాత్రే కదా నిద్రలేకపోతే ఏమవుతుందిలే అనుకుంటున్నారా.. అలాగయితే తల మీద గట్టి దెబ్బ తగిలినా ఏమవుతుందిలే అనుకోగలుగుతారా అని అడుగుతున్నారు పరిశోధకులు. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఒక రాత్రి నిద్రపోకపోతే కనుక ఆ ప్రభావం మెదడులో ఎన్ఎస్ఇ, ఎస్-100బి అనే కణాలపైన పడుతుంది.. మెదడుకి దెబ్బ తగిలినప్పుడు పరిస్థితి ఎలా వుంటుందో నిద్రపోకపోతే కూడా అదే పరిస్థితి.. ఫోన్ లో చాట్ చేస్తూనో..కంప్యూటర్ ముందు పని చేస్తూనో రాత్రంతా మేలుకొని ఉండటం మెడడుని ప్రమాదంలోకి నెట్టటమే…

నిద్రలేమి వల్ల వ్యక్తి రోజు వారీ ఎదురయ్యే సాధారణ ఒత్తిడిని కూడా తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటారు. దీని వల్ల చిరాకు, అసహనం, మూడీగా ఉండడం, దేని పైనా మనసు పెట్టలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

పరీక్షకు వెళ్లడానికి ముందు చాలా మంది రాత్రంతా మేల్కొని చదివేస్తుంటారు. దీని వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. ఏదైనా నేర్చుకోవాలన్నా, జ్ఞాపకం పెట్టుకోవాలన్నా కంటి నిండా నిద్ర తప్పనిసరని తాజా అధ్యయనాల్లో తేల్చారు.చాలీ చాలని నిద్ర మెదడుకు నేర్చుకునే సామర్థ్యాన్ని, కొత్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడం, జ్ఞాపకాల్ని తిరగతోడడం వంటి వాటన్నింటినీ తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు.

దీర్ఘకాలం పాటు నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నట్టయితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యల్ని పరిష్కరించే నేర్పు తగ్గడం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్థూలకాయం, మానసిక కుంగు బాట్లు, తరచూ ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి.నిద్ర తగ్గితే క్యాన్సర్లు, టైప్-2 మధుమేహానికి కారణమయ్యే ఇన్సులిన్ నిరోధకత సమస్యల వంటివి కూడా చుట్టు ముడతాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.అందుకని ఇక మీదట రాత్రుళ్లు మేల్కొని కంప్యూటర్లతో సెల్‌ఫోన్లతో కుస్తీలు పట్టకుండా ఎంచక్కా నిద్రపోండి.

(Visited 821 times, 1 visits today)