Home / Political / చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోని స్మృతీ ఇరానీ.

చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోని స్మృతీ ఇరానీ.

Author:

smruthi irani landed in controversy

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మరో వివాదం లో ఇరుక్కున్నారు. మానవత్వం గురించీ, దేశభక్తి గురించీ పే..ద్ద ఉపన్యాసం ఇచ్చి, తాను మాత్రం అవి పాటించడంలో విఫలం అయ్యారు.. మంత్రి స్మృతీ ఇరానీ శనివారం రాత్రి యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళుతుండగా ఆమె కాన్వాయ్ ముందు వెళ్తోన్న కారు ని డీకొట్టింది. ఆ కారు ఆ ముందున్న టూ వీలర్ ను ఢీ కోట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆగ్రాకు చెందిన వైద్యుడు రమేశ్‌ గాయాలపాలై అనంతరం ప్రాణాలొదిలారు. తీవ్ర గాయాలపాలైన ఆయన బంధువు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయిన మృతుని కుమార్తె స్మృతీ పై సంచలనమైన ఆరోపణలు చేసింది. మంత్రి కాన్వాయ్‌లోని వాహనం తమ ద్విచక్ర వాహనాన్ని రెండు సార్లు ఢీ కొట్టడంతో తన తండ్రి చనిపోయారని బాధిత కుటుంబం ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

ప్రమాదం జరిగిన తర్వాత రక్తమ్మడుగులో పడి ఉన్న తమకు కనీస వైద్య సహాయం అందించడానికి మంత్రి ముందుకు రాలేదని.. కారు దిగి బయటకు వచ్చారని, రక్తం కారుతున్న స్థితిలో తాను చేతులు జోడించి తాము ఆసుపత్రికి వెళ్లేందుకు సహకరించాలని వేడుకుంటే ఆమె వినిపించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. స్మృతీ వెళ్ళిపోయిన తర్వాత తాము సాయం పొందామని, ఇరానీ చేసిన ట్వీట్‌లో నిజం లేదన్నారు. గాయాలపాలైన తన బంధువు కూడా వైద్య చికిత్స కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని చెప్పారు. పిల్లలు సహాయం కోసం అర్థిస్తున్నా మంత్రి స్మృతి ఇరానీ చూసి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె సోదరుడు అభిషేక్‌ ఆరోపించాడు. దీంతో అభిషేక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా జరిగిన ఈ ఆరోపణలకు మంత్రి కార్యాలయం స్పందించింది ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని ప్రయత్నించామనీ. అయినా మంత్రి కారు వల్ల ప్రమాదం జరగలేదని ఎస్‌ఎస్‌పీ రాకేష్‌ సింగ్‌ తెలిపారు. అయితే తన కారు తగలనంత మాత్రాన అలా వదిలేసి వెళ్ళిపోవచ్చా? ఆమె కాన్వాయ్ లోని కారే కదా అని అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం రాలేదు. ఈ ఘటనలో ఆమె ఎడమ ముంజేయి, కుడి కాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ఆ గాయలకు మాత్రం అక్కడికక్కడే ప్రథమ చికిత్స జరగటం గమనార్హం..

(Visited 1,983 times, 1 visits today)