Home / Videos / Video: ఎలుక అనుకుని ప్లాస్టిక్ బాటిల్ ని మింగేసిన పాము

Video: ఎలుక అనుకుని ప్లాస్టిక్ బాటిల్ ని మింగేసిన పాము

Author:

పాము నోట్లో ఒక బాటిల్… ఇదేంటి పాము గానీ కూల్ డ్రింక్ తాగేసింది అనుకుంటున్నారా? అదేంలేదు..ఈ వింత సంఘటన గోవా దగ్గరలోని కార్వే గ్రామంలో జరిగింది. అసలేం జరిగిందో ప్రత్యక్ష సాక్షి మాటల్లో చెప్పాలంటే…ఎప్పటిలాగే ఆరోజూ మాములుగా మొదలైంది. కానీ దారిలో ఇండియన్ కోబ్రా జాతికి చెందిన పాము చాలా ఇబ్బందిగా కష్టపడుతూ కదులుతూ కనబడింది. దగ్గరకెళ్ళి చూస్తే దాని కడుపు పెద్దగా ఉబ్బేసి ఉంది.. ఏదో పెద్ద కప్పో, ఏలుకో ఇంకేదో జంతువునో మింగేసి ఇబ్బంది పడుతుంది అనుకున్నాము. కానీ మెల్లి మెల్లిగా ఆ పాము తన కడుపులో ఉన్నదాన్ని నోటి గుండా బయటకు విసర్జిస్తుంటే అందరం ఆశ్చర్యానికి లోనయ్యము. పాము నోటి లోంచి ఒక ప్లాస్టిక్ బాటిల్ బయటపడడం తో అక్కడి గ్రామస్తులంతా ముక్కున వేలేసుకున్నారు అని చెప్పాడు వన్యప్రాణి సంరక్షకుడు గౌతం భగత్. అయితే పాము బాటిల్ ని కక్కేసినాక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం గమనార్హం. వెంటనే అక్కడే ఉన్న వన్యప్రాణి సంరక్షకుడు గౌతం భగత్ తో పాటు గ్రామస్తులు ఆ పాముని అడవిలో వదిలేసారు.

అయితే పాము ఆ ప్లాస్టిక్ బాటిల్ ని ఎందుకు మింగిందనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టలేదు. ఎవ్వరిని అడిగినా నాకు సరైన సమాధానం మాత్రం దొరకలేదని అన్నాడు వన్యప్రాణి సంరక్షకుడు గౌతం భగత్..ఐతే ఎలుక అనుకుని ఆ బాటిల్ ని మింగేసి ఉంటుందనేది అక్కడి గ్రామస్తుల అంచనా. మరో వైపు మనుషులు అడవులన్నీ ఆక్రమించుకుంటూ పోతుంటే పాపం ఈ వన్యప్రాణులకు తినే తిండి కూడా దొరక్క ఇలా ఎలుక అనుకుని బాటిల్ ని మింగేసి ఉంటుందని మరో గ్రామస్తుడు చెప్పడం మాత్రం చర్చనీయాంశమే. ఏది ఏమైనా ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్ ని పాము మింగేయడం.. మళ్ళి మెల్లిగా దాన్ని కక్కేయడం అనేది మాత్రం మొదటి సారి వినడం, చూడడం ఇదే అన్నారు గౌతం భగత్ . ఇదంతా చోద్యం చూసిన గ్రామస్తులు ఈ పాము ఘన కార్యం వీడియో తీయడమే కాకుండా ఆన్లైన్ లో అప్లోడ్ చేసేసారు..దాంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.

(Visited 2,962 times, 1 visits today)