Home / Political / తన మోసాన్ని ఒప్పుకోని స్నాప్ డీల్. ఇంకా కస్టమర్ మీద యుద్దం చేస్తూనే ఉంది

తన మోసాన్ని ఒప్పుకోని స్నాప్ డీల్. ఇంకా కస్టమర్ మీద యుద్దం చేస్తూనే ఉంది

Author:

Iphone 68 rupees 1

స్నాప్ డీల్ ఇంకా తన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం లేదు. తన పొరపాటు వల్ల రెండు సార్లు కోర్టు  మొట్టికాయలు తిన్నా ఇంక తన ఓటమిని ఒప్పుకోవటానికి సిద్దంగా లేదు. సంగతేమిటంటే రెండు నెలల క్రితం వచ్చిన వార్త మీకు గుర్తుండే ఉంటుంది. మరో సారి…

ఆపిల్ ఐఫోన్ పై 99.7% డిస్కౌంట్ అన్న ఆఫర్ స్నాప్ డీల్ వెబ్సైట్లో చూసిన నిఖిల్ బన్సాల్ అనే పంజాబ్ కు చెందిన బీ.టెక్ విధ్యార్థి వెంటనే ఆర్డర్ చేసాడు. అయితే అది పొరపాటున వచ్చిన ప్రకటన అన్న విషయం గమనించిన స్నాప్ డీల్ వెంటనే ఆ ప్రకటనని తీసేసింది. అతనికి ఫోన్ పంపటం కుదరదని కూడా చెప్పలేదు. ఫిబ్రవరి 12 న అతను ఆర్డర్ చేసిన ఆపిల్ ఐఫోన్ 5స్ సెరీస్ ఫోన్ తనకు వస్తుందని ఎదురు చూసీ..చూసీ విసిగిపోయాడు నిఖిల్ బన్సాల్. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటు వల్ల వచ్చిన ప్రకటన కావటంతో స్నాప్ డీల్ కూడ పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు… ఇక చివరకు స్నాప్ డీల్ మీదనే పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా వినియోగదారుల కోర్ట్ లో కేసు ఫైల్ చేసాడు.

దాంతో స్నాప్ డీల్ దిగి రాక తప్పలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఫోన్ ని అతనికి 68 రూపాయలకు అమ్మటమే కాదు, కోర్టు ఖర్చుల నిమిత్తం తిరిగి అతనికే 2000 రూపాయలని చెల్లించాలి అని కోర్టు తీర్పునిచ్చింది. ఇంకో దిమ్మ తిరిగే విశేషం ఏమిటంటే… ఇదే విషయంలో రెండో సారి రిటర్న్ కేస్ ఫైల్ చేసిన స్నాప్ డీల్ కోర్టునే తప్పుదోవ పట్టించాలని చూసిందన్న అభియోగంతో పాటు 10,000 రూపాయ ఫైన్ కట్టాల్సి వచ్చింది. మొత్తానికి ఒక చిన్న టెక్నికల్ పొరపాటు నికిల్ భన్సాల్ పాలిట వరంగా మారితే స్నాప్ డీల్ కి మాత్రం పంచ్ మీద పంచ్ ఇచ్చింది.

ఐతే కథ అక్కడితో ముగిసిపోలేదు తను ఓటమిని ఒప్పుకోవటం అంటే మార్కెట్ లో తన బ్రాండ్ కి తలవంపులు తెచ్చుకున్నట్టే అని భావించిన స్నాప్ డీల్ నిఖిల్ కి ఫోన్ ని ఇంకా ఇవ్వకపోగా ఈ సారి నేషనల్ కన్స్యూమర్ ఫోరం లో అప్పీలు చేసి నిఖిల్ ని మరింత ఇబ్బంది పెట్టి తద్వారా కేసు నెగ్గాలని చూస్తోంది. ఈ మేరకు కోర్టులో తన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది కూడా… ఇదే మాదిరి మళ్ళీ ఎదురయ్యే సంఘటనలకు ఒక పాఠంగా కూడా ఒక సందేశాన్ని కస్టమర్ లకు ఇవ్వాలని భావిస్తోంది స్నాప్ డీల్. ఇప్పటికే ఆన్ లైన్ షాపింగ్ లో జరిగే అవకతవకల మూలంగా నష్టపోయిన కస్ట్మర్లు తమ మీద లీగల్ గా ప్రొసీడ్ అవకుండా ఉండటానికి కూడా ఈ కేసులో గెలవటం ముఖ్యం అనుకుంతోందీ ఆన్లైన్ వ్యాపార సంస్థ…

(Visited 1,491 times, 1 visits today)