Home / Political / స్నాప్ చాట్ యాప్ పై ఆన్ లైన్ యుద్ధం చేస్తున్న భారతీయులు.

స్నాప్ చాట్ యాప్ పై ఆన్ లైన్ యుద్ధం చేస్తున్న భారతీయులు.

Author:

సోషల్ మీడియా పవర్ ఎమిటో అంచెనా వేయలేక చాల కంపనీలు బొక్క బోర్ల పడుతున్నాయి. మొన్నటికి మొన్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం నుండి ఒక ప్రయాణికుడిని బయటకు లాగి వేసిన ఘటణ వీడియో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచమంత నిముషాలలో షేర్ అయి ఆ ఎయిర్ లైన్స్ పరువు పోయేలా చేసింది. ఆ ఘటణ తో ఆ కంపనీ షేర్లు పడిపోయి కోట్లలో నష్టం మూటగట్టుకుంది ఆ ఎయిర్ లైన్స్. ఇప్పుడు స్నాప్ చాట్ సీఈవో తమ కంపనీ సమావేశంలో ఇండియాలాంటి పేద దేశంలో తమ మార్కెట్ విస్తరించాలన్న ఆలోచన లేదని వ్యాఖ్యానించారన్న సంగతి బయటికి రావడంతో ఇప్పుడు స్నాప్ చాట్ యాప్ వారికి పగలే చుక్కలు చూపిస్తున్నారు భారతీయ నెటిజన్లు.

snap chat is not for poor countries

అన్ని ప్రముఖ కంపనీలన్ని మార్కెట్ కోసం భారత్ వైపు చూస్తుంటే స్నాప్ చాట్ సీఈవో మాత్రం ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేసాడని తెలియడంతో అతడిపై భారతీయులు సోషల్ మీడియా లో తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి తమ ఫోన్లలోని స్నాప్ చాట్ యాప్ డిలీట్ చేసి యాప్ స్టోర్ లో స్నాప్ చాట్ కి తక్కువ రేటింగ్ ఇస్తున్నారు. ఆ దెబ్బకి ఒకటే రోజులో స్నాప్ చాట్ యాప్ రేటింగ్ 5 నుండి 1 స్టార్ కి పడిపోయింది. అయితే స్నాప్ చాట్ మాత్రం తమ సీఈవో ఏనాడు ఆ వాఖ్యలు చేయలేదని తమ సంస్థ నుండి తీసివేయబడ్డ ఒక మాజీ ఉద్యోగి కావాలనే ఇలా తప్పుడు ఆరోపణలు చేసాడని వెల్లడించింది. అది నిజమో కాదో తెలుసుకునే లోపే స్నాప్ చాట్ యాప్ కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

(Visited 1,522 times, 1 visits today)