Home / Videos / సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆలీ…..’బ్రూస్ అలీ….కాట్రాయ్…..’

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆలీ…..’బ్రూస్ అలీ….కాట్రాయ్…..’


ఓం…భహ్….భహ్….బ్రూస్ లీ” అంటూ….యమధర్మరాజు గెటప్ లో ఉన్న సత్యనారాయణ పిలవగానే….చొక్కా లేకుండా బైక్ నడుపుతున్న ఆలీ ప్రత్యక్షం…“కరాటే లు …కుంగ్ ఫూలు చేసుకునే వారు కూడా కాబోయే కలెక్టర్లకు సలహాలు ఇచ్చేయటమే“…..అని వెంటనే డైలాగ్ “సలహాలివ్వటానికి చదువక్కర్లేదు”….రివర్స్ పంచ్…

“మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిసైన్ చేస్తున్నాం…..స్పైడర్ మ్యాన్..సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ లో మీరే హీరో”….ఒక ఆడపిల్ల వయ్యారపు మాటలు….

“కోడల్ని తెచ్చుకునేది మనకున్న స్టేటస్ ని పెంచుకోవటానికి కాదు…మనకు లేని కూతురుని తెచ్చుకోవటానికి”..అంటూ ఓ ముత్తైదువ ఆర్ద్రతతో అన్న డైలాగ్స్…

“ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ ని పట్టుకుంటానని వెళ్ళి బార్డర్ దాకా వెళ్ళి బార్బర్ షాప్ పెట్టాడు….ఇంటరెస్టింగ్ గా ఉంది…..ఎవరు సర్ అతను…సుజుకి సుబ్రహ్మణ్యం…ఎలియాస్ పీటర్..ఏలియాస్ పకోడీ…ఏమండీ జుట్టు మనదే కదా అని…కటింగ్ మనమే చేసుకోలెం కదా!” ...”ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్న మాట మన దగ్గర! నేను నీ గురించి వెదుకుతుంటే నువ్వే డైరెక్ట్ గా వచ్చావు”…..

“నా ఫ్యామిలీ జోలికి ఎవడోచ్చినా వాడికి చావుని సెంటీ మీటర్ దూరం లో చూపిస్తాను”, “నిన్ను మా వాళ్ళు వేటాడి చంపే విజువల్ ని నేను చూడాలి…”,“ఐ యాం ఫైటర్..టేకప్ చేసిన మిషన్ ఫినిష్ చేసే వరకూ నో ఇంటర్వెల్ ….జస్ట్ క్లైమాక్స్…

ఆ వెంటనే..ఆశిష్ విద్యార్ధి…..ఆలీ మధ్య హీటెడ్ కాన్వర్సేషన్….సీన్ కట్ చేస్తే ..ఆలీ విజువల్ తో బ్రూస్ లీ ..ద ఫైటర్….అనే ట్యాగ్ లైన్ తో ఎండ్ కార్డ్…

మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న విలన్స్ నీ, కమెడియన్స్ నీ ..వాళ్ళు వివిధ సినిమాల్లో పండించిన సీన్స్ నీ మిక్స్ చేస్తూ తీసిన ఈ స్పూఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా రౌండ్స్ కొడుతోంది……

(Visited 39 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]