Home / Inspiring Stories / స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య.

స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య.

Author:

ఈ ప్రపంచంలో స్నేహానికి ధనిక, పేద,కులం, రంగు అడ్డురాదు. ఈ దునియాలో స్నేహంలో ప్రతి మనిషి మునిగితేలుతూనే ఉంటాడు అదే స్నేహం యొక్క గొప్పదనం. స్నేహం అనేది కష్ట,సుఖాలలోనే కాదు .. చావులో కూడా తోడుగా ఉంటా అంటూ తన స్నేహితుని కోసం మరణించాడు మరో  స్నేహితుడు. మన భాగ్యనగరానికి ఎంతో మందికి విద్య కోసం, ఉపాధి కోసం వస్తుంటారు అలానే వచ్చినవారు గుంటూరు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణ, రమేష్.

hyderabad-ramesh-harikrishna-suicide

వీరిద్దరూ చిన్నతనం నుండే ప్రాణ స్నేహితులు, ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఉన్నత చదువులు చదివిన హరికృష్ణ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రమేష్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అంకెల్లో జీతాలు వేరు అయినా వీరి స్నేహానికి అడ్డురాలేదు. ఇద్దరు కలసి హాస్టల్లో ఒకే రూమ్ లో ఉంటున్నారు.

హైదరాబాద్ లోని మూసాపేటలో బుధవారం తెల్లవారు జామున వీరిద్దరూ కలసి బైక్ పై  వస్తున్నా సమయంలో… వీరి బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెల్లింది. దానితో వెనుక కూర్చున్న హరికృష్ణ స్పాట్ లోనే చనిపోయాడు. హెల్మెంట్ పెట్టున్న రమేష్ కొద్దీ గాయాలతో బయటపడ్డాడు.

హరికృష్ణ చనిపోయిన విషయం తెలియక రమేష్ చాలా సమయం తన స్నేహితున్ని లేపటానికి అన్ని విధాలుగా ప్రయత్నించి, చివరకు తన స్నేహితుడు చనిపోయాడని నిర్ధారించుకొని తాను లేని జీవితం ఎందుకనుకొని పక్కనే ఉన్న భరత్ నగర్ లోని రైలు పట్టాలపై కింద పడి ప్రాణాలను తీసుకున్నాడు. ఇన్ని రోజులు కలసి బ్రతికిన వీరు ఒకే రోజు చనిపోవడంతో వారి ఇద్దరి కుటుంబాలు, స్నేహితులు, సన్నిహితులు  దుఃఖ సాగరంలో మునిగిపోయాయి.

(Visited 1,043 times, 1 visits today)