Home / Entertainment / డిసెంబర్ 25న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పాటలు.

డిసెంబర్ 25న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పాటలు.

Author:

soggade chinni nayana

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం … ‘సోగ్గాడే చిన్ని నాయనా’. సంక్రాంతి కానుకగా జనవరి 15న మన ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియోని డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ ఆడియోని విడుదల చేస్తున్నారు. అక్కినేని అభిమానులు ఈ వేడుకకు భారిగా తరలి రానున్నారు. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్‌తో విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను డిసెంబర్ 25న నిర్వహించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మించారు.

సోగ్గాడే చిన్ని నాయనాకు వైవిధ్యంగా ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 25న ఆడియో వేడుకని కూడా విభిన్నంగా జరపాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల్లో జరగబోయే అడియో ఫంక్షన్ లో లైవ్ ట్రయిలర్ షో కార్యక్రమం రూపొందించారు. ఇలాంటి కార్యక్రమాన్ని తెలుగులో ప్లాన్ చేయడం బహుశా ఇదే తొలిసారేమో. లైవ్ ట్రయిలర్ అంటే.. ట్రయిలర్ కట్ చేసిన తరువాత అది ఎలా వుంటుందో యాజ్ ఇట్ ఈజ్ గా స్టేజ్ మీద అదే నటులు పెర్ఫార్మ్ చేయడం అన్నమాట.

(Visited 880 times, 1 visits today)