Home / Uncategorized / సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’

Author:

Soggade Chinni Nayana Movie Censor Report

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించాడు.. ఇక అనసూయ, హంసా నందిని ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఇటీవలే ఘనంగా ఆడియో విడుదల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఊ/ఆ’ సర్టిఫికేట్ పొందింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ కూడా ఆనందం వ్యక్తం చేసింది.

ఈ చిత్రంలో తండ్రిగా కనిపించే బంగార్రాజు పాత్ర ఆత్మగా ఉండబోతుందని నాగార్జున తెలిపాడు. ఈ చిత్ర కథ నచ్చి వెంటనే తన సొంత బ్యానర్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నానని నాగార్జున తెలిపాడు. ఈ చిత్రంలో నాగ్ ఒక పాత్రలో సోగ్గాడిగా కనిపించగా, మరో పాత్రలో అమాయకుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ని విడుదల చేసారు.

(Visited 68 times, 1 visits today)