Home / Entertainment / ‘సోగ్గాడే చిన్ని నాయన’ కొత్త ట్రైలర్.

‘సోగ్గాడే చిన్ని నాయన’ కొత్త ట్రైలర్.

Author:

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ,లావణ్య త్రిపాఠి జంటగా అనసూయ, హంస నందిని ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం అందించిన ఈ చిత్రానికి అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. తాజా ఈ చిత్రానికి సంబంధించి ఒక కొత్త ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో నాగార్జున ఒక పాత్రలో సోగ్గాడిగా, మరొక పాత్రలో అమాయకుడిగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో సోగ్గాడుగా ఉండే బంగార్రాజు పాత్ర ఆత్మ అని, తను చనిపోయిన తర్వాత తన భార్యకి, కొడుకుకి మాత్రమే కనిపిస్తానని చెప్పుకొచ్చాడు నాగార్జున.

తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ లో ఆత్మ రూపంలో నాగ్ కనిపిస్తాడు. ఇక యముడి పాత్రలో మెగా హీరో నాగబాబు చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నాడు.ఈ స్టొరీ లైన్ నచ్చి వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిపాడు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తుందని నాగార్జున ధీమాగా ఉన్నాడు.

(Visited 207 times, 1 visits today)