Home / Inspiring Stories / సోలార్ సైకిల్ సృష్టించిన కర్నూలు కుర్రాడు.

సోలార్ సైకిల్ సృష్టించిన కర్నూలు కుర్రాడు.

Author:

అద్బుతాలు చేసేవారు రెండు  రకాలు అంటుంటారు. అందులో ఒక రకం ఈ ప్రపంచానికి తనేంటో తెలియజేయడం కోసం, లేద తనకు తెలిసింది ప్రపంచానికి పరిచయం చేయాడం. ఈ రెండిటిలో ఏది జరిగిన ప్రపంచం ముందు  ఒక అద్బుతమైన అవిష్కరణ ఉంటుంది.ఇప్పుడు మనం మాట్లాడుకునే అబ్బాయి ప్రపంచానికి తన ఉనిఖిని తెలియడం కోసం ఒక అద్బుత అవిష్కరణ చేశాడు అంటే మంచిదేమో…

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని లద్దగిరికి చెందిన మునీర్‌ ఐటీఐలో ఎలక్ర్టీషియన్‌ కోర్సు పూర్తి చేశాడు. మున్నిర్ తల్లిదండ్రులు రసూల్‌, షాహిన్‌ లను పేదరికం వెక్కిరించడంతో 2015లో పాలిటెక్నిక్‌లో చేరి మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది, మున్నిర్ తన చదువుని వదిలేశాడు కాని తనలో ఉన్న ఏదో ఒకటి చేయాలన్న ఆశయాన్ని కాదు.. ఏ పని చేయాలో తెలియని ఒక అసంతృప్తిలోనే తన తండ్రి కొనిచ్చిన సైకిల్ గుర్తుకొచ్చింది అంతే దాని పై తన కొత్త ఆలోచనకు పదును పెట్టాడు.  ఇప్పుడు తన ఊరిలో అదే సైకిల్ పై చక్కర్లు కొడుతుంటే ఊరి ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతకు మున్నిరు చేసిన ఆశ్చర్యకరమైన పైని ఎంటి ఒక చూద్దాం.

సోలార్ సైకిల్‌ Solar Cycle Kurnool Student

మున్నిరు తన తండ్రి కొనిచ్చిన సైకిల్ కు సోలార్‌ ప్యానల్‌ ఏర్పాటు చేశాడు. సోలార్ ఫ్యానల్ ద్వారా ద్వారా బ్యాటరీకి మూడు వోల్టుల విద్యుత్‌ అందుతోందని, మిగిలిన 12 వోల్టులను కరెంటు ద్వారా రీచార్జ్‌ అయ్యే ఏర్పాటు చేశాడు. సోలార్‌తో అయితే మూడు గంటలు, కరెంటు ద్వారా అయితే ఒక రోజంతా సైకిల్‌ నడుస్తుంది.

ఈ వయస్సులో ఇంత చేసిన తనకు సైకిల్ పై పోతుంటే ఎంతయిన బోరు కొడుతుంది కద! అందుకే సీటు ముందు రాడ్డుకు ఒక బాక్స్‌ ఏర్పాటు చేసి అందులో పాటలు వినేందుకు స్పీకర్లు, సెల్‌‌ఫోన్ రీచార్జ్ చేసుకోవడానికి ప్లగ్‌ను కూడా ఏర్పాటు చేశారు.అంతేగాక సైకిల్‌కు శబ్దాల ఇండికేటర్‌ను, రాత్రిపూట వాడుకోడానికి ఎల్‌ఈడీ లైటు ఏర్పాటు చేశారు.ఈ ఏర్పాట్లన్నిటికీ రూ. 5 నుంచి 6 వేల మధ్య ఖర్చు అయిందని మునీర్‌ చెప్పారు. అంతేకాకుండా బ్రేకులు వేయగానే శబ్దం వచ్చేలా ఓ మైక్‌ ఏర్పాటు చేశారు. దీనికి కేవలం రూ. 250 ఖర్చు చేసి బర్జర్‌ అమర్చారు.

Solar Cycle By Kurnool Student

ఈ విషయం పై మున్నిర్ మాట్లాడుతూ.. నాకు ఇలాంటి అవిష్కరణలు చేయడమంటే చాలా ఇష్టం. నా తల్లిదండ్రుల పేదరికం కారణంగా పై చదువులు చదువలేకపోతున్న ఎవరైన ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తే ఖచ్చితంగా రానున్న రోజూలలో ఇంక మంచి ప్రయోగాలు చేసి మా ఊరికి, జిలాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తాను అంటున్నాడు ఈ యువ శాస్రవేత్త, ఇలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి సరైన ప్రోత్సాహం ఇస్తే కొత్త కొత్త ఆవిష్కరణల కోసం బయటి దేశాల వైపు చూడాల్సిన అవసరం లేదు.

(Visited 1,315 times, 1 visits today)