Home / Inspiring Stories / ఉపవాసాలు, పూజలతో చనిపోయిన భర్తని బ్రతికించుకున్నానన్న భార్య.

ఉపవాసాలు, పూజలతో చనిపోయిన భర్తని బ్రతికించుకున్నానన్న భార్య.

Author:

పురాణాలలో చదివిన కథలలో భర్త మరణిస్తే భార్య దేవుని అనుగ్రహం పొంది తన భర్తను తిరిగి ప్రాణాలతో దక్కించుకునేవారని చదివే ఉంటారు. ఉదా.. సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను యమధర్మరాజు వెంట పడి చాలా దూరం వరకు వెళ్లి తన భర్త తనకు కావాలంటూ తిరిగి దక్కించుకుంది. సరిగ్గా ఇలాగే తన జీవితంలో కూడా జరిగింది అని అంటుంది ఒక భారతదేశ సైనికుడి భార్య. తన భర్త మరణించాడని చెబితే నమ్మకుండా ప్రతి రోజు పూజలు, ఉపవాసాలు చేసింది..ఆమె కోరిన విదంగానే చనిపోయాడనుకున్న తన భర్త 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు.

ఒక రోజు అర్ద రాత్రి తలుపు చప్పుడు కావడంతో ఎవరో వెదవలు తాగి చప్పుడు చేస్తున్నారు అనుకోని వెళ్లి తలుపుతీసిన సుబేదార్ కైలాశ్ యాదవ్(చనిపోయాడు అనుకున్న సైనికుడి తండ్రి)కి ఒక్కసారిగా ఎం చేయాలో తెలియక కళ్ళలో నీళ్ళు తిరిగాయి . ఇంతలో ఇంట్లో ఉన్న అందరూ వచ్చారు, అందరి కళ్ళు కన్నీరుతో నిండిపోయాయి. చివరికి ఇన్ని రోజులు పూజలు, ఉపవాసాలు చేసిన ఆవిడ వచ్చింది. తనను  అలానే చూస్తూ ఉండిపొయింది. ఎందుకంటే ఇన్ని రోజులు తను ఎవరి గురించి అయితే పూజలు, ఉపవాసాలు చేసిందో అతనే తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోతున్నారు.. ఇది ఎక్కడో పురాణాలలో జరిగిన కథ కాదు అలాగే సినిమాలో జరిగిన కథ అంతకంటే కాదు. ఎందుకంటే ఇది నిజంగా జరిగిన కథ ….

soldier came home after 7 years
చనిపోయాడు అనుకున్న ఆ వ్యక్తి పేరు ధర్మవీర్ సింగ్ అసలు ఎం జరిగిందో ఇలా చెప్పుకొచ్చాడు…. అది 2009 సంవత్సరం ఒక  డివైడర్‌ను గుద్దుకొని మేము ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిందని. ఆ తర్వాత ఎం జరిగిందో తనకు తెలియదు అని కొద్ది రోజుల క్రితం మాత్రం హరిద్వార్లో తిరిగాను అని, అలాగే పోయిన వారం తను బిచ్చం అడుకుంటుంగా టూ వీలర్ పై  వచ్చిన ఒకతను  తనను గుద్ది  ఆసుపత్రిలో  తనే జాయిన్ చేశాడని. ఆ తర్వాత తనకు స్పృహ వచ్చి అన్ని గుర్తుకు వచ్చాయి. అలాగే తనను గుద్దిన వ్యక్తి తనకు 500 రూపాయలు ఇచ్చాడని వాటితోనే నేను తిరిగి ఇంటికి వచ్చాను అని అన్నాడు.

ఇక దీని గురించి ధర్మవీర్ తమ్ముడు మాట్లాడుతూ… ధర్మవీర్ డెహ్రాడూన్‌లోని 66 ఆర్మర్డ్ రెజిమెంట్‌లో జవాన్ అని తెలిపాడు. మా అన్నగారు వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదానికి గురి అయినప్పుడు అందులో ముగ్గురు ఉన్నారని ప్రమాదం అయిన తర్వాత వారిద్దరూ తిరిగి వారి యూనిట్లకు వెళ్ళారని, ఇక మా అన్నయ్య గురించి ఎక్కడ వెతికినా ఆచూకి లభించకపోవడంతో 2009లో మా అన్నయ్య మరణించినట్లు భావించి సైన్యం వారికి మూడేళ్ళ తర్వాత ధ్రువపత్రాన్ని అందిస్తూ పించన్ ని కూడా ఇస్తుంది అని తెలిపాడు.

అలాగే చివరగా ధర్మవీర్ భార్య మనోజ్ దేవి మాట్లాడుతూ… నాకు సైన్యం వారు చెప్పినప్పుడు నాకు నమ్మబుద్ది కాలేదు ఎందుకంటే తనకు తన భర్త బ్రతికే ఉన్నాడు అనిపించింది. ఇదే విషయాన్ని ఇంట్లో చాలా సార్లు చెప్పాను అని అలాగే తన భర్త తిరిగి రావాలని ఎన్నో రోజులుగా పూజలు చేస్తూ, ఉపవాసాలు ఉంటున్నా అని అందుకే ఆ దేవుడు నా భర్తను క్షేమంగా తిరిగి ఇంటికి పంపించాడు  అని తెలియజేసింది.

(Visited 1,195 times, 1 visits today)