Home / Inspiring Stories / మన నాగరుకత గురించి మనమే నమ్మలేని నిజాలు కొన్ని.

మన నాగరుకత గురించి మనమే నమ్మలేని నిజాలు కొన్ని.

Author:

గణిత శాస్త్రంలో భారతీయులు కనిపెట్టిన “సున్నా” ప్రపంచ గణిత, భౌతిక పరిశోధక రంగాన్నే ఒక మలుపు తిప్పింది, కణ శాస్త్రాన్ని ప్రతిపాదించిన కణాదుడూ, రేడియో తరంగాలని కనిపెట్టిన జగదీష్ చంద్రబోస్ లు వెనకబడిపోయి మార్కోనీ వంటి యూరోపియన్ శాస్త్రవేత్తలు చరిత్రలో నిల్చిపోయారు. నాగరికథ తెలియదు అని ఎగతాళికి గురైన భారతీయులు ఈ “నాగరిక” ప్రపంచానికి ఏమిచ్చారో తెలుసుకుంటే మీరు ఒకింత ఆశ్చర్య పోవటం ఖాయం. వాటిలో కొన్ని చూడండి మరి…..

కొలబద్ద (స్కేలు):

SONY DSC

ఔను తవ్వకాలలో బయటపడ్డ సింధూ లోయ నాగరికతా కాలానికి చెందిన వస్తువుల్లో దసాంశ ఉపవిభాగాలతో సహా(మిల్లీ మీటర్ ల సూచిక) దంతాలతో చేసిన స్కేళ్ళు కనిపించాయి. వీటిని క్రీస్తు పూర్వం 1500 వ కాలానికి చెందినవని కనిపెట్టారు. దానికి ముందు ఇదివరకెక్కడా ఇంత ఖచ్చితమైన కొలతలతో ఉన్న స్కేలు ఉన్నట్టు గా ఆధారాలు లేవు…

షాంపూ:

5-Best-Shampoo-and-Conditioner-Combinations-for-Indian-Hair1

తలవెంట్రుకలకు మన భారతీయులిచ్చే ప్రాముఖ్యత తెలిసిందే కదా,మరి మన దేశంలోనే మొదటి కేశ సంరక్షణ పద్దతులు మొదలయ్యాయ్ అని చెప్పటానికి అనుమానమేముంది,శీకాయ,కుంకుడూ కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో భాగమయ్యాయ్. షాంపూ అనే మాట చాంపో (चाँपो) అనే పర్షియన్ పదం నుంచి వచ్చింది. 1762 లోనే బెంగాల్ నవాబులు తల మర్థన కొసం వాడే ప్రత్యేక తైలమే నేటి షాంపూ గా మారింది.

ప్లాస్టిక్ సర్జరీ:

Plastic Surgery

అవును, మీరు చదివిందే నిజమే, ప్లాస్టిక్ సర్జరీని కనిపెట్టింది భారతీయులే, క్రీస్తు పూర్వం 800వ సంవత్సరంలోనే ప్లాస్టిక్ సర్జరీ పద్దతిని కనిపెట్టారు.

చొక్కా గుండీ(బటన్):

buttons

ఒకింత తమాషాగా అనిపించినా 2000సంవత్సరాలకు ముందే అంటే క్రీస్తుకు పూర్వమే మనవారు దుస్తులకు బటన్లు కుట్టుకోవటం చేసే వారు అప్పటి దాకా అన్నీ కుర్తాల వంటి పై నుంచి తొడుక్కునే దుస్తులే కదా..! ఇండస్ వ్యాలీ నాగరికథా తవ్వకాలలో బయట పడిన దుస్తులకున్న బటన్స్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. సింధూ నాగరికథ కాలం క్రీస్తు పూర్వమే వర్థిల్లిన సంగతి తెలుసు కద…

చెస్(చదరంగం):

chess

మోస్ట్ ఇంటెలిజెంట్ గేం గా ప్రసిద్ది చెందిన చెస్ ని కనిపెట్టిందీ భారతీయులే. అరవైనాలుగు గడుల ఈ అద్బుతమైన ఆట 6వ శతాబ్దం లో గుప్తుని కాలం లో ప్రాచుర్యం లోకి వచ్చింది.

క్యాటరాక్ట్ ఆపరేషన్:

cataract

భారతీయ వైద్యుడు సుశ్రుతుడు 6వ శతాబ్దం భ్ఛే లోనే కంటిశుక్లం శస్త్ర చికిత్సలని చేసాడు.అప్పటికే కంటి శస్త్ర చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చింది. ఇది భారతదేశం నుండి చైనా వ్యాపించింది. గ్రీకు నుంచి వచ్చిన వైద్య శాస్తఙ్ఞులు ఈ శస్త్ర చికిత్సలను నేర్చుకునే వారు.

రేడియో తరంగాలు:

wireless-comm

గుగిల్మో మార్కోనీ అనే యూరోపియన్ శాస్త్రవేత్త కి రేడియో తరంగాల అభివృద్దిలో చేసిన కృషికి గానూ 1909 లో నోబెల్ బహుమతి అందుకున్నారు. కానీ దానికి ముందే మనదెశానికి చెందిన జహ్గదీష్ చంద్ర బోస్ రేడియో తరంగాలపై పరిషోదనలు చేసి ఫలితాలను రాబట్టారు కూడా. కా మార్కొనీ తరవాత చాలా సంవత్సరాలకి ఆయనకు గుర్తింపు వచ్చింది.

చంద్రుని పై నీరు:

moon

2008వ సంవత్సరంలో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ అంతరిక్ష నౌక చంద్రుని పై నీరు ఉన్నట్టు గుర్తించింది. చంద్రుడి పై నీరు ఉందని తెలిపే చిత్రాలను పంపించింది. చంద్రుడి పై నీరు ఉన్నట్టు ప్రపంచానికి తెలియజేసింది మనమే.

లోహ పని ముట్ల/యంత్రాలు:

Metal works

పురాతన భారతీయులు ఖనిజశాస్త్రంలో అగ్రగాములు. దాదాపు రెండు వేల సంవత్సరాల ముందే తయారు చేయబడిన కొన్ని పని ముట్లూ, కాశ్మీర్ లో దోరికిన అతి పురాతన మైన గ్లోబూ దీన్ని ఋజువు చేస్తున్నాయి కూడా.

ఇంక్(సిరా):

ink

పురాతన భారతదేశం లో 4 వ శతాబ్దం నుండి, ఒక పదునైన కోణాల సూదితో సిరాని ఉపయోగించి తాటాకులపై రాయటం దక్షిణ భారతదేశంలో సర్వసాధారణం.కార్బన్ వర్ణద్రవ్యం తో తయారు చేసిన ద్రావణాన్ని సిరాగా వాడి ఎన్నో రచనలను చేసారు.

ఫ్లష్ టాయిలెట్లు:

flush-toilet

ఫ్లష్ టాయిలెట్లు మొదటి సింధు లోయ నాగరికతలో ఉపయోగించారు. ఈ అనేక గృహాల్లో ఉనికిలో మరియు ఒక అధునాతన పద్దతిలో మురుగునీటి లైన్ లు అనుసంధానం చేయబడ్డాయి. సింధూ నాగరికత కాలపు మనుషులు హైడ్రాలిక్ ఇంజనీరింగ్లో ప్రాచుర్యంలో ఉండేవారు.

వజ్రాల వెలికితీత:

wedding-ring-versus-engagement-ring

18వ శతాబ్దంలో దక్షిణాఫ్రికాలో డైమండ్ కనిపెట్టనంత వరకు ప్రపంచానికి భారతదేశం నుండే వజ్రాలు ఎగుమతి అయ్యేవి. 5000 సంవత్సరాల క్రితమే మధ్య భారత దేశంలో వజ్రాల వ్యాపారం జరిగింది.

పత్తి దుస్తులు:

Cotton Clothes

పురాతన గ్రీకులు జంతు చర్మాలనే దుస్తులుగా వాడేవాళ్ళు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలోనే భారతీయులు దూది తోనూ, ఉన్ని తోనూ బట్తలు తయారు చేసి ధరించటం మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి అది గ్రీకు వ్యాపారులూ, సందర్శకుల ద్వారా ప్రపంచమంతా పాకింది.

(Visited 2,884 times, 1 visits today)