Home / Entertainment / సోనూసూద్ తండ్రి శక్తి సూద్ గుండెపోటుతో మృతి.

సోనూసూద్ తండ్రి శక్తి సూద్ గుండెపోటుతో మృతి.

Author:

Sonu Sood Father Expired today

సోనూసూద్ అంటే తెలియని తెలుగు సినిమా ప్రేమికులు లేరు. ప్రతినాయకుడి పాత్రలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనస్సు గెలిచాడు. తన ఇంట ఆదివారం విషాదం నెలకొంది. అతని తండ్రి శక్తి సాగర్ సూద్ ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం జాకీచాన్ తో సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న సోనూసూద్ ఇటీవలే తన తండ్రిని చూడటానికి పంజాబ్ లోని మోఘాలో ఉన్న తన నివాసానికి వెళ్ళాడు. ఆదివారం రాత్రి తన తండ్రితో కలిసి టీవి చూస్తున్న సమయంలో శక్తి సూద్ ఒక్కసారిగా గుండెపోటుతో కింద పడిపోయాడు. దాంతో వెంటనే ఆసుపత్రికి సోనూ సూద్ తన తండ్రిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ 2008 లో అనారోగ్యంతో మృతి చెందగా, గత నాలుగు సంవత్సరాల నుండి శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న శక్తిసూద్ ఆదివారం మరణించాడు. సోనూసూద్ తండ్రి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

(Visited 162 times, 1 visits today)