Home / Videos / నింగికెగసి నేలను చేరీ….సురక్షితంగా భూమిని చేరిన ఫాల్కన్‌-9

నింగికెగసి నేలను చేరీ….సురక్షితంగా భూమిని చేరిన ఫాల్కన్‌-9

Author:

రాకెట్లు ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడతాయి.. కానీ అవి తిరిగి రావని ఇప్పటి వరకుతెలుసు. అయితే ఇక విమానాల్లాగే రాకెట్లూ మళ్లీ తిరిగొస్తాయి.. వాటిని మళ్లీ వాడుకోవచ్చు కూడా. అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లిన ‘ఫాల్కన్ 9’ అనే రాకెట్ విజయవంతంగా భూమిపైకి వచ్చింది. స్పేస్‌ఎక్స్ చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీ రాకెట్ సముద్రంపై సక్సెస్‌ఫుల్‌గా దిగింది. ఫాల్కన్ 9 రాకెట్ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న డ్రోన్ నౌకపై క్షేమంగా ల్యాండైంది. దీంతో స్పేస్‌ఎక్స్ కంపెనీ రాకెట్ ప్రయోగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇటీవలే ఓ రాకెట్‌ను నేలపై క్షేమంగా దించిన ఆ కంపెనీ ఇప్పుడు సముద్ర జలాలపై మరో రాకెట్‌ను విజయవంతంగా దింపడం అంతరిక్ష పరిశోధనల్లో అత్యద్భుత ఘట్టంగా భావిస్తున్నారు. గతంలో అనేక సార్లు నిర్వహించిన పరిశోధనల తర్వాత ప్రైవేటు రాకెట్ ప్రయోగ సంస్థ ఈ ఫీట్‌ను అందుకుంది.

స్పేస్-ఎక్స్ కంపెనీ అద్భుత విజయాన్ని సాధించింది. ఫాల్కన్‌-9 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపి మళ్లీ అదే రాకెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నేలపై దిగేలా చేసింది. ఆ అద్భుత ఘట్టం ఫ్లోరిడాలోని కేప్ కెనరవల్‌లో చోటుచేసుకుంది. గతంలో మూడుసార్లు ఈ ప్రయోగాల్లో విఫలమైన స్పేస్ ఎక్స్ ఈ సారి మాత్రం అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది. గత జూన్‌లో రెండు టన్నుల సరుకుతో నింగికెగిరిన వ్యోమనౌక పేలడంతో స్పేస్‌ఎక్స్ కంపెనీకి దారుణమైన దెబ్బ తగిలింది. కానీ ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఆకాశంలోకి పంపిన స్పేస్ ఎక్స్ నౌక విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ఆ తర్వాత సురక్షితంగా ల్యాండైంది. సాధారణంగా నింగిలోకి ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్లు ఆకాశంలోనే పేలిపోతాయి. అయితే అలాంటి రాకెట్లను మళ్లీ వాడుకునేలా చేసిన ప్రయోగం నిజంగా అద్భుతం. దాని వల్ల రోదసి ప్రయాణాలకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. అంటే ఒకే రాకెట్‌ను మళ్లీ మళ్లీ నింగిలోకి పంపే అవకాశం ఉంటుంది. తాజా రాకెట్ ఒరాకోంబ్ నెట్‌వర్క్ కోసం సుమారు 11 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఆ తర్వాత నేలపై దిగేందుకు ఆ రాకెట్‌కు వాతావరణం కొంత వరకు సహకరించలేదు. కానీ చివరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ రాకెట్ భూమిపై సురక్షితంగా దిగింది. ఫాల్కన్-9 రాకెట్ ధర సుమారు 60 నుంచి 90 మిలియన్ డాలర్లు ఉంటుందని స్పేస్ ఎక్స్ పేర్కొంది.

స్పేస్ ఎక్స్ రాకెట్ నింగి దిశగా సుమారు వంద మైళ్ల దూరం ప్రయాణించింది. అది కూడా 17 వేల స్పీడ్‌తో వెళ్లినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇటీవల మరో ప్రైవేటు కంపెనీ బ్లూ ఆర్జిన్ కూడా ఓ రాకెట్‌ను విజయవంతంగా భూమిపై ల్యాండ్ చేసింది. అయితే ఆ రాకెట్ కేవలం 62 మైళ్ల దూరం మాత్రమే వెళ్లి వచ్చింది. స్పేస్-ఎక్స్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అభినందించింది. కృత్రిమ ఉపగ్రహాలను (పేలోడ్) అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రతిసారి కొన్ని వేల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయి. ఎంతో విలువైన రాకెట్ సామగ్రి కూడా నాశనం అవుతోంది. ఇప్పుడు స్పేస్-ఎక్స్ చేపట్టిన ప్రయోగంతో రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.అమెజాన్ కంపెనీకి చెందిన బ్లూ ఆరిజిన్ అనే రాకెట్ల తయారీ కంపెనీ గత ఏడాది నవంబర్‌లో ఈ తరహా ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. అయితే ఈ ప్రయోగంలో నేరుగా భూమిపై ల్యాండ్ కాకుండా పారాచూట్ సహయంతో నేలపైకి వచ్చింది.

(Visited 521 times, 1 visits today)