Home / Latest Alajadi / ఏనుగు నుంచి పడిపోయిన డిప్యూటీ స్పీకర్‌

ఏనుగు నుంచి పడిపోయిన డిప్యూటీ స్పీకర్‌

Author:

అస్సోం డిప్యూటీ స్పీకర్ కృపానాథ్‌ మల్లాహ్‌ ప్రమాదవశాత్తు అంబారీ నుంచి కింద పడిపోయారు. ఆదివారం రతాబరి నియోజకవర్గంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్‌ 5న కృపానాథ్‌ అస్సోం అసెంబ్లీ ఉప సభాపతిగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలనుకున్నారు. ఇందుకోసం అంబారీని సిద్ధం చేశారు.కృపానాథ్‌ కరీంగంజ్‌ జిల్లాలోకి రాగానే ఆయన్ని అంబారీ ఎక్కించారు. ఆయన ముందు మావటి కూడా కూర్చున్నాడు.

speaker of Assam assembly Kripanath Mallah falls off an elephant.

అయితే బరువు మోయలేక ఏనుగు ఒక్కసారిగా ముందుకు పరిగెత్తడంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఆ సమయంలో మీడియా వర్గాలు తీసిన వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.అయితే ఈ ఘటనలో కృపానాథ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

(Visited 1 times, 1 visits today)