Home / Latest Alajadi / ఈరోజు డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే మీ లైసెన్స్, పాస్ పోర్ట్, వీసాలు రద్దు..!

ఈరోజు డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే మీ లైసెన్స్, పాస్ పోర్ట్, వీసాలు రద్దు..!

Author:

తప్ప త్రాగి రోడ్ల మీదకి వస్తున్న వాహనదారులకు మరియు యువతకు ట్రాఫిక్ పోలీసులు కొత్త పద్దతిలో బుద్ది చెప్పనున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జరిమానాలు విధించినా, జైలు శిక్ష అని చెప్పినా కూడా మందు బాబులు త్రాగి బండ్లు నడుపుతూనే ఉన్నారు. వీరికి అడ్డుకట్ట వేయడానికి ఇకనుండి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారి వివరాలు అన్ని దేశాల కాన్సులేట్‌ లకు పంపుతామని ట్రాఫిక్ డీసీపీ ప్రకటించారు. చాలా దేశాలు ట్రాఫిక్ నేరాలను కూడా క్రిమినల్ కేసుల క్రిందా పరిగణలోకి తీసుకుని అలాంటి వారికి వీసాలు మంజూరు చేయవు. దాంతో మన దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే ఇక విదేశాలకు వెళ్ళాలనే కల, కలగానే మిగిలిపొయే చాన్స్ ఉంది.

drive

ఈ కొత్త నిభందనను ఈ రోజు రాత్రి నుండే అమలు పరచనున్నారు. న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా మ‌ద్యం తాగి, వాహనాలు నడ్పి ట్రాఫిక్ పోలీసుల‌కు దొరికితే ఇక విదేశాలకు వెళ్ళాలన్న మీ క‌ల ఎప్పటికి తీరదు. ఇవే వివరాలు అన్ని దేశాల కాన్సులేట్‌ లతో పాటు మనదేశ పాస్‌పోర్టు, విభాగానికి కూడా పంపనున్నారు. దానితో కొత్త పాస్‌పోర్టు, పొందేవారికి కూడా ఇది ఇబ్బంది గా మారనుంది. ముందుగా ఈ వివరాలు హైదరాబాద్  లోని అమెరికా కాన్సులేట్‌కు అందిస్తామ‌ని ట్రాఫిక్ డీసీపీ తెలిపారు.వీటితో పాటు కొత్తగా అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం డ్రంకన్ డ్రైవ్ లో పట్టు పడిన వారి డ్రైవింగ్ లైసెన్సు ని రద్దు చేసి, పది వేల రూపాయలని జరిమానాజరిమానాతో పాటు జైలు శిక్ష విధించే ఆవకాశం కూడా ఉంది. అందుకే ఇప్పటికైనా మద్యం సేవించి వాహనం నడపకండి.

(Visited 261 times, 1 visits today)