Home / Entertainment / ఈ రోజే ‘స్పీడున్నోడు’ పాటలు వినిపిస్తాడట !

ఈ రోజే ‘స్పీడున్నోడు’ పాటలు వినిపిస్తాడట !

Author:

Speedunnodu Movie Audio

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మొదటి తనయుడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బ్లెంకొండ గణేష్‌బాబు నిర్మించిన,వి.వి. వినాయక్‌ డైరెక్షన్ లో వచ్చిన ‘అల్లుడుశీను’ చిత్రంతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. భారీ బడ్జెట్ సినిమాతో టాలీవుడ్కి ఇంతవరకు ఎ హీరో ఎవ్వని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఎం లాభం మనోడు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.

కానీ ఇప్పుడు రెండు సంత్సరాల గ్యాప్ తీసుకోని మరి రీమేక్ స్పెషలిస్ట్ అయిన భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘స్పీడున్నోడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్‌కి జోడీగా సోనారిక బడోరియా కనిపించనుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ, స్నేహామే ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందుతోంది ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించిన సుందరపాండ్యన్ సినిమాకు రీమేక్. ఈ సినిమాను ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఆడియోని ఈనెల 22న అంటే ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘అల్లుడు శీను’లో లానే ఈ సినిమాలో కూడా తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ లో కనిపించనుంది..

(Visited 83 times, 1 visits today)