Home / Reviews / స్పీడున్నోడు సినిమా రివ్యూ & రేటింగ్.

స్పీడున్నోడు సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Speddunnodu Movie Perfect review and rating

అల్లుడు శీను చిత్రంతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే కమర్షియల్‌ హిట్ సొంతం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రీమేక్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో స్పీడున్నోడు అంటూ జెట్ స్పీడ్ తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు…మరి ప్రేక్షకులు ఈ స్పీడ్ ను ఎలా తట్టుకున్నారో ఇప్పుడు చూద్దాం…

కథ :

శోభన్ (బెల్లంకొండ శ్రీనివాస్ ) ఇతడికి నలుగురు ఫ్రెండ్స్.. వారిలో మధునందన్ అనే కుర్రాడు వాసంతి (సోనారిక భడోరియా )ని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విషయం ఆమెకు చెప్పేంత ధైర్యం లేదు. ఫ్రెండ్ అయిన శోభన్ తో తన ప్రేమ విషయం ఆమెకు చెప్పమని చెపుతాడు. వాసంతిని కలిసి శోభన్ తన ఫ్రెండ్ మధునందన్ ప్రేమ గురించి చెపుతాడు. కానీ.. వాసంతి మాత్రం మీ ఫ్రెండ్ అంటే ఇష్టం లేదు , నువ్వు అంటే ఇష్టమని చెప్పి షాక్ ఇస్తుంది. ఆ తర్వాత శోభన్ ఆమెను ప్రేమిస్తాడా..? లేక ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి అని వదిలిస్తాడా..?? ఈ పరిణామాలు ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి పరిస్థితులకు దారితీశాయి..??? అనేది మిగతా స్టొరీ.

అలజడి విశ్లేషణ:

శోభన్ బాబు గా బెల్లంకొండ శ్రీనివాస్ మెప్పించాడు ,అయితే క్లైమాక్స్ లో మాత్రమే అతడికి నటించే చాన్స్ వచ్చింది .ఇక డ్యాన్స్ లలో మరింతగా రాణించాడు . మిగతా క్యారెక్టర్ అంతా సాదా సీదా గా సాగిపోయింది . భీమనేని శ్రీనివాసరావు నుండి వస్తున్న చిత్రం దానికి తోడూ భారీ నిర్మాత తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరో కావడంతో పైగా తమిళంలో హిట్ అయిన సినిమా కావడంతో స్పీడున్నోడు చిత్రంపై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఆ అంచనాలను అందుకోలేకాపోయాడు అనుకోవాలి.

హీరోయిన్ సోనారిక విషయానికి వస్తే సోనారిక అందాలు పారబోసినప్పటికి ……. నటనకు పెద్దగా అవకాశం లేని పాత్రే ! దానికి తోడూ వెండితెర మీద అంత అందంగా లేదు కానీ బుల్లితెర పై పార్వతీ దేవిగా అలరించింది . తమన్నా స్పెషల్ సాంగ్ కథకు పెద్దగా ఉపయోగ పడక పోయినప్పటికీ కమర్శియల్ గా ఉపయోగ పడేలా ఉంది . గ్రామపెద్దలుగా ప్రకాష్ రాజ్ ,రావు రమేష్ లు నటించగా ఇల్లరికపు అల్లుళ్ళు గా పోసాని ,30 ఇయర్స్ పృథ్వీ లు కొద్దిసేపు నవ్వించారు . ఈ సినిమాలో కామెడి అనేది వర్కౌట్ అయ్యింది అంటే ఈ ఇద్దరి వల్లే !ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు .

ఇది రీమేక్ సినిమా.. ఒక నేటివిటీ కథని మన నేటివిటీకి సెట్ అయ్యేలా చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం. ఆ మార్పులు సెట్ అయితే సినిమా పెద్ద హిట్ లేదా ప్రేక్షకులకి నచ్చదు. అలాగే ఇది పక్కా తమిళ్ నేటివిటీ సినిమా, ఆ నేటివిటీనే ఆ సినిమాకి హెల్ప్. దాని తెలుగులోకి అన్నప్పుడు నేటివిటీని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఈ సినిమాకి ఎంచుకున్న నేటివిటీ పర్ఫెక్ట్ గా సెట్ కాలేదు. స్నేహం ఎంత గొప్పది అనే చెప్పే ఓ కథని ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథని జోడించి చెప్పడం బాగుంది. మెయిన్ గా ఈ సినిమా చివరికి వచ్చేసరికి వరుసగా రివీల్ అయ్యే ట్విస్ట్ లు ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే చివరి 20 నిమిషాలు సినిమాకి ఆయువు పట్టు అని చెప్పాలి. ఈ ఎపిసోడ్ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చడమే కాకుండా స్నేహం గురించి చెప్పే లైన్స్ ఓ మంచి ఫీల్ ని ఇస్తుంది. ఈ క్లైమాక్స్ మాత్రం యూత్ ని బాగానే ఆకట్టుకుంటుంది . టైటిల్ లో ఉన్న స్పీడ్ సినిమాలో లేకపోవడంతో ఓవరాల్ గా ప్రేక్షకులు కొద్దిగా నిరశాపడటం ఖాయం .

సాంకేతిక వర్గం పనితీరు:

విజ‌య్ ఉల‌గ‌నాథ‌న్ సినిమాటోగ్ర‌ఫీ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది.. శ్రీ వసంత్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి..గుడ్ విల్ సినిమా బ్యానర్ ఫై భీమనేని సునీత ,రోశిత సాయి ఖర్చు కు వెనకడుగు వేయకుండా సినిమా రిచ్ గా తీసి సక్సెస్ అయ్యారు. ఇక భీమనేని శ్రీనివాస రావు గురించి కొత్తగా చెప్పేది ఏముంది రీమేక్ చిత్రాలను సూపర్ హిట్ చేయడం లో దిట్ట మన తెలుగు ఆడియన్స్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా స్పీడున్నోడు ను స్పీడ్ గానే చూపించాడు..కాకపోతే అక్కడక్కడ కాస్త స్లో గా అనిపించినా సినిమాని బాగా తెరకెక్కించాడు.

ప్లస్ పాయింట్స్:

  • సంగీతం
  • స్క్రీన్ ప్లే
  •  కామెడీ
  • క్లైమాక్స్ ఎపిసోడ్.

మైనస్ పాయింట్స్:

  • ఎడిటింగ్
  • స్లో నేరేషన్
  • కమర్షియాలిటీ కోసం నేటివిటీని మిస్ చేయడం.

అలజడి రేటింగ్: 2.5/5

                                                     పంచ్ లైన్: హీరో స్పీడ్ గా ఉన్నాడు…స్టోరి స్లో ఉంది.

(Visited 885 times, 1 visits today)