Home / Videos / Video: మహిళ చెవి నుండి బయటకి వచ్చిన సాలీడు పురుగు.

Video: మహిళ చెవి నుండి బయటకి వచ్చిన సాలీడు పురుగు.

Author:

ఈ మధ్య రిలీజయిన స్పైడర్ సినిమా ట్రైలర్ చూశారా. ఒక రోబో స్పైడర్ మెల్లిగా పాక్కుంటూ వెళ్లి హిరో మహేష్ బాబు భుజం పైకి చేరుతుంది. అచ్చం ఇలాగే జరిగింది బెంగుళూరు లో కాకపొతే .. భోజనం చేసి పడుకున్న ఒకావిడ చెవిలోకి దూరింది స్పైడర్..అదే సాలీడు పురుగు. ఈ వింత సంఘటన వివరాల్లోకెళితే …

పంటి నొప్పి, చెవిపోటు వస్తే భరించలేమన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక విపరీతంగా చెవి పోటు వస్తే..అది తల నొప్పిగా పరిణమిస్తే.. ఆసుపత్రికి పరిగెత్తాల్సిందే. బెంగళూరుకు చెందిన లక్ష్మీ (49) అనే మహిళకు ఇదే అనుభవం ఎదురయింది. భరించలేనంత తలనొప్పితో ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన డాక్టర్లు ఆమె తల నొప్పికి అసలు కారణం చెవిలో గూడు కట్టుకున్న స్పైడర్ (సాలె పురుగు) అని గుర్తించారు. డాక్టర్లే కాదు అందరూ షాకయ్యారు. చెవిలో స్పైడర్ ఏంట్రా బాబు అనుకున్నారు. అసలేం జరిగిందని లక్ష్మీ ని ఆరా తీశారు.

జూన్ 10 న మ‌ధ్యాహ్న౦ భోజనం చేశాక ఇంటి వ‌రండాలో ప‌డుకుందట. లేవగానే త‌ల‌నొప్పి మొదలైంది. కుడి చెవిలో ఏదో ఉన్నట్లు అనిపించిందట. చెవిలో ఏదో తిరుగుతున్నట్టు కూడా అనిపించడంతో, చాలా సార్లు చెవిలో ఉన్నదాన్ని తీసేందుకు ప్రయత్నం చేసింది. బట్ ఏదీ రాలేదు పైగా తలనొప్పి అంతకంతకూ పెరగడంతో దగ్గరలోని కొలంబియా ఏషియా ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను అన్ని రకాలుగా పరీక్షించిన ఏణ్ట్ డాక్టర్ సంతోష్ శివస్వామి ఆమె చెవిలో స్పైడర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే లక్ష్మి చెవిపై టార్చ్ లైట్ వేయగానే ఆ వెలుగుకు స్పైడర్ పాక్కుంటూ దానికదే చెవిలో నుంచి బయటకు వచ్చేసింది. తలనొప్పి తగ్గడం తో పాటూ ఇంకెలాంటి సమస్యా రాకపోవడంతో అంటా ఊపిరి పీల్చుకున్నారు. చెవిలో జోరీగలు దూరడం చూసాం కానీ ఈ స్పైడర్ దూరదమేంటి అని అంతా ముక్కున ..సారీ చేవిలో వేలేసుకున్నారు. నమ్మకం కలగాట్లేదా ? అయితే క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేయండి.

(Visited 276 times, 1 visits today)