Home / Entertainment / మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్…!

మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్…!

Author:

మహేష్ బాబు తన అభిమానుల కోసం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు శ్రీమంతుడు సినిమాలో విలన్ దగ్గరికి వెళ్ళేప్పుడు వాడీన తన సైకిల్ ని పాపం చాలా చీపుగా ఇచ్చేస్తున్నాడట మూడు లక్షల విలువ చేసే ఈ సైకిల్ ని తమ సినిమాను ఆదరించి, ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకుల కోసం “కేవలం” 999 రూపాయలకే ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.ఈ సైకిల్ ని పొందటానికి మనం కష్ట పడక్కర్లేదట. iamsrimanthudu.com అనే లింక్ లోకి లాగిన్ అయ్యి జస్ట్ 999/- తో రిజిస్టర్ చేసుకుంటే చాలట. ఇలా వచ్చిన ఎంట్రీ లన్నిటి నుంచీ ఒక్క అదృష్ట వంతున్ని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి ఆ శ్రీమంతుడు సైకిల్ ని అంద జేస్తారట.

ఎంట్రీ చేసుకున్న మిగిలిన అభిమానులకు మహేష్‌తో కలిసి ఒక రోజు షికారు చేసే అవకాశాన్ని కల్పించింది చిత్ర యూనిట్ కల్పించింది. అంతే కాదు, కొన్ని ప్రత్యేక బహుమతులను అందించబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్మాతలు భావిస్తున్నారు. పేరు ఎంట్రీ చేసుకున్న ప్రతి ఒక్కరికీ మహేష్‌బాబు సంతకం చేసిన టీషర్ట్ ఇస్తారట. ఇంకెందుకు ఆలస్యం త్వరగా మీ పేరును నమోదు చేసుకోండి.

(Visited 34 times, 1 visits today)