Home / Entertainment / తదుపరి సినిమా కి రెడీ అవుతున్న శ్రీను వైట్ల

తదుపరి సినిమా కి రెడీ అవుతున్న శ్రీను వైట్ల

Author:

srinu

శ్రీనువైట్ల అనగానే తన సినిమాలతో నవ్వులు పుయిస్తాడు అనేది ఒక్కపటి మాట కానీ ఇప్పుడు తనె నవ్వుల పాలు అవుతున్నాడు. తను తెలుగులో నీ కోసం, ఆనందం, సొంతం, వెంకీ, అందరివాడు, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, దూకుడు, బాద్‍షా సినిమాలకి దర్శకత్వం వహించి టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు.

కానీ శ్రీనువైట్లకు ‘ఆగడు’ తర్వాత బ్యాడ్ టైమ్ మొదలైంది. ‘ఆగడు’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవ్వడం, ఆ తర్వాత వచ్చిన ‘బ్రూస్ లీ’ కూడా అదే స్థాయిలో పరాజయం పాలవ్వడంతో శ్రీనువైట్ల క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. వరుస ఫ్లాప్ లతో ఒక వైపు, ఇంట్లో సమస్యలతో మరోవైపు బాధపడుతున్నడు. శ్రీనువైట్ల కు తదుపరి సినిమాను సి. కళ్యాణ్‌ నిర్మాణంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే వైట్లకు ఆనందం మళ్ళీ మొదలైనట్లే. పూరీ జగన్నాథ్‌తో చేసిన ‘లోఫర్’ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన సి.కళ్యాణ్, ఆ సినిమా విశేషాలను పంచుకుంటూ, తన తదుపరి సినిమా ప్రస్తావనను కూడా తీసుకువచ్చారు. దర్శకుడు శ్రీనువైట్లతో తన తదుపరి సినిమా ఉంటుందని సి. కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

(Visited 52 times, 1 visits today)