Home / Entertainment / శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు రివ్యూ & రేటింగ్.

శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు రివ్యూ & రేటింగ్.

Author:

Srirastu-Subhamastu-review

అల్లు వారి ఇంటి నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఇంతకు ముందు నటించిన రెండు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దానితో కోట సమయం తీసుకోని ఇప్పుడు యువత, సోలో డైరెక్టర్ ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ లో లావణ్య త్రిపాఠి తో శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు అంటూ మన ముందుకు వచ్చాడు. అసలే హిట్ లేక భాదపడుతున్న శిరీష్ కి ఫ్లాఫ్ లో ఉన్న ప‌ర‌శురామ్ హాయ్ ఇచ్చాడలేదా ! ఒక్కసారి చూద్దాం.

కథ:

ఒక పెద్ద ధనవంతుని కొడుకు శిరీష్(అల్లు శిరీష్) ఒక మధ్యతరగతి అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ ఆమ్మాయి పేరు అనన్య (లావణ్య త్రిపాఠి). ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించడం తన అదృష్టమని అనుకోని ఎలాగైనా అమ్మాయి ప్రేమను పొందాలని ఈ విషయాన్ని తన తండ్రి ( ప్రకాష్ రాజ్) చెప్పుతాడు. అప్పుడు శిరీష్ తండ్రి కేవ‌లం డ‌బ్బు కోస‌మే అన‌న్య నిన్ను ప్రేమిస్తది, నీవు న‌చ్చి కాదు అని అంటాడు. దానితో అయితే ఈ డ‌బ్బు, ల‌గ్జ‌రీ లైఫ్ వ‌దిలేసి ఓ పేదింటి వాడిగానే ఆ అ అమ్మాయి ప్రేమ‌ను పొందుతాన‌ని తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు..మ‌రీ అత‌ను అనుకున్న‌ట్లే ఆమె ప్రేమ‌ను పొందాడా.., డ‌బ్బు కోస‌మే అమ్మాయిలు అబ్బాయిల‌ను ప్రేమిస్తారన్న తండ్రికి క‌నువిప్పు క‌లిగిస్తాడా అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

మన తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తగా ఆలోచిస్తే తప్పుగా అనుకుంటారు అని దర్శకులు ఫిక్స్ అయినట్టు ఉన్నారు. అందుకే పాత సినిమాలను తిప్పి తిప్పి మనకు చూపిస్తున్నారు. పోనీ కథలో కొత్తదనం లేకపోయినా కథనంలోనైనా కొత్తగా చూపించాలి. ఇప్పుడు ఈ సినిమా లో అదే జరిగింది పాత కథను మరియు కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు డైరెక్టర్. కానీ ఇలాంటి కథలు తెలుగు సినిమా లో ఎన్నో ఏళ్లుగా వస్తూనే వున్నాయి.. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా బొమ్మరిల్లు సినిమాను కాస్త పోలి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇలాంటి ఫామిలీ డ్రామా ఎంటర్టైనర్ సినిమాకు స్క్రీన్ ప్లే అనేది చాల ముఖ్యం అయితే ఇందులో అదే మిస్ అయ్యింది. సినిమా మొదటి భాగములో శిరీష్ మరియు లావణ్య ల మధ్య ఉన్న సన్నివేశాలు మరియు వారి మధ్య గొడవలు తెలుగు ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ ను అందించినప్పటికీ రెండవ భాగం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఇంటర్వెల్ తరువాతి కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల ఓపికను పరీక్షిస్తాయి.

అయితే ద్వితీయార్థం తడబడింది. సన్నివేశాలన్నీ సాగదీత ధోరణిలోనే నడిచాయి.ఒకే పాయింట్‌ చుట్టూ గిరి గీసుకొని కథ తిప్పడంతో.. కొన్ని సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయి. చివర్లో అందరూ మారిపోయి హీరో హీరోయిన్ల పెళ్లి జరిపించడం లాజిక్‌కు అందదు.అక్కడక్కడా డైరెక్టర్ తన పదునైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు.

నటీనటుల పనితీరు:

గత రెండు సినిమాలతో పోలిస్తే శిరీష్‌ చాలా మారాడు. డైలాగ్‌ డెలివరీలో.. బాడీ లాంగ్వేజ్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ.. ఇంకా చాలా చేయాల్సి వుందనిపిస్తుంది. లావణ్య అందంగా కనిపించింది. అయితే ద్వితీయార్థంలో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్‌ లేదు. ప్రకాష్‌రాజ్‌ పాత్ర పరిధి తక్కువ. రావు రమేష్‌ మధ్యతరగతి తండ్రిగా ఆకట్టుకొన్నాడు. అలీ, సుబ్బరాజు అక్కడక్కడా నవ్వించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ద‌ర్శ‌కుడు పరశురామ్ రాసుకున్న కథ, కథనం చాలా పాతది. కానీ కొన్ని డైలాగులు బాగున్నాయి.. ముఖ్యంగా శిరీష్, లావ‌ణ్య మ‌ధ్య జ‌రిగే సీన్ లు కొన్నియూత్ ని ఆక‌ట్టుకునేలా మాత్రమే ఉన్నాయి. . అలాగే త‌మన్ అందించిన సంగీతం సినిమాకి  ప్లస్ అయింది,. కొన్ని పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఇక కెమెరా ప‌నిత‌నం సినిమాకు నిండుద‌నాన్ని ఇచ్చింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇకపోతే గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలాగే బాగా రిచ్ గా ఉండి సినిమాను మరో మెట్టు పైకెక్కించాయి.

ప్లస్ పాయింట్స్:

  • అల్లు శిరీష్
  • లావణ్య త్రిపాఠి
  • మ్యూజిక్
  • కామెడీ

మైనస్ పాయింట్స్:

  • కథ
  • స్క్రీన్ ప్లే

అలజడి రేటింగ్: 2.5/5

పంచ్ లైన్: బొమ్మరిల్లు సినిమాని కొత్తగా చూడాలంటే ఈ సినిమాకి వెళ్లొచ్చు..!

(Visited 1,638 times, 1 visits today)